Degree Student Harrasment Case | కోచ్ వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
వాలీబాల్ కోచ్ అంబాజీ వేధింపులు తట్టుకోలేక లాలాగూడ పరిధిలో మౌనిక (19) అనే డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

విధాత : వాలిబాల్ కోచ్ వేధింపులు తట్టుకోలేని ఓ డిగ్రీ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా దేవాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మౌనిక (19) తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతుంది. అదే కాలేజీలో వాలీబాల్ కోచ్ గా అంబాజీ పని చేస్తున్నాడు.
తనను ప్రేమించాలని మౌనికను అంబాజీ వేధిస్తుండటంతో ..తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అంబాజీ కోసం గాలిస్తున్నారు.