Brilliant Engineering College | బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కోటి నగదు దోపిడీ
అబ్దుల్లాపూర్ మెట్‌లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో కోటి రూపాయల నగదు దోపిడీ జరిగింది. దుండగులు లాకర్లు పగలగొట్టి, సీసీ కెమెరాల డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలోని అబ్దుల్లా పూర్ మెట్ లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దోపిడీ కలకలం రేపింది. కాలేజీలోని లాకర్స్ పగులగొట్టిన దుండుగులు..అందులోని కోటి రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. బ్రిలియంట్ సంస్థకు చెందిన 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులు ఇక్కడే ఓకే చోట జమ చేశారు. అయితే దొంగలు సేఫ్ లాకర్స్ ని ధ్వంసం చేసి డబ్బులు దోచుకెళ్లారు.
ఫిర్యాదు అందుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కాలేజీకి చేరుకుని చోరీ ఘటనను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోటి రూపాయల నగదు చోరి పని ఒక్కడే చేసినట్లుగా పోలీసుల అనుమానిస్తున్నారు. దుండగుడు తెలివిగా పోలీసులకు చోరి ఆధారాలు చిక్కకుండా 200 సీసీ కెమెరాలతో కూడిన డీవీఆర్ ను సైతం ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. త్వరలోనే కేసును చేధిస్తామన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram