గచ్చిబౌలిలో కుప్పకూలిన ఏడంతస్తుల భవనం..ఇద్దరు మృతి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందగా, సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో భవన శిధిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. మృతదేహాన్ని హైడ్రా సిబ్బంది శిధిలాల నుంచి బయటకు తీశారు. ఏడంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనం కూలడంతో దాని శిథిలాలు పక్కనున్న అపార్ట్‌మెంట్‌పై పడ్డాయి. దీంతో పక్కనే హాస్టల్‌లో ఉన్న వ్యక్తులు భయంతో పరుగులు తీశారు.

నాలాను ఆనుకొని 50 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. హాస్టల్ కోసం ఈ భవనం నిర్మిస్తున్నట్లుగా సమాచారం. కుప్పకూలిన భవన శిధిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారో లేదోనని రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.

Latest News