Yadagirigutta Temple : యాదగిరిగుట్ట దేవాలయంలో బంగారం, వెండి డాలర్ల మాయం !
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి డాలర్లు మాయమైన ఘటన ఆడిట్‌లో బయటపడి కలకలం రేపుతోంది.
విధాత : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మరో స్కామ్ బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయమవ్వడం కలకలం రేపుతుంది. రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి డాలర్లు మాయమైన వ్యవహారం అధికారుల ఆడిట్ లో బయటపడింది.
ఇప్పటికే ప్రసాద శాల పోటులోని చింతపండు చోరీ అంశంతో అభాసు పాలైన దేవస్థానం ప్రతిష్ట… తాజాగా బయటపడిన బంగారం, వెండా డాలర్ల వ్యవహారంతో మరింత పలచనయ్యే పరిస్థితి నెలకొందని భక్తులు విమర్శిస్తున్నారు. యాదగిరి గుట్ట దేవాలయం పాలనా అంశాలపైన, వెలుగుచూస్తున్న అక్రమాలపైన, ఉద్యోగుల పనితీరుపైన ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టి దేవస్థానం పాలనను గాడిలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
SBI POs Monthly Salary : ఎస్‌బీఐ పీవో నెల జీతం రూ.1.25 లక్షలు.. సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ
Tirumala laddu controversy| తిరుమల లడ్డులో కెమికల్స్ వాడారు: టీడీపీ వీడియో వైరల్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram