Heavy Rains | హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. తడిసి ముద్దైన భాగ్యనగరం
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం( Heavy Rains ) కురిసింది. నిన్నంతా ఎండ దంచికొట్టింది. వాతావరణ( Weather ) మార్పుల దృష్ట్యా ఈ కుండపోత వర్షానికి( Downpour ) భాగ్యనగరం తడిసి ముద్దైంది.
Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వర్షం( Heavy Rains ) కురిసింది. నిన్నంతా ఎండ దంచికొట్టింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లారేసరికి ఎండకాలం మాదిరి ఉక్కపోత పోసింది. కానీ వాతావరణ( Weather ) మార్పుల దృష్ట్యా మంగళవారం పొద్దున వాన దంచికొట్టింది. ఈ కుండపోత వర్షానికి( Downpour ) భాగ్యనగరం తడిసి ముద్దైంది. పొద్దు పొద్దున్నే వాన కురియడంతో నగర వాసులు వెదర్‌ను ఎంజాయ్ చేశారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అంబర్‌పేట్, రాంనగర్, ఓయూ, తార్నాక, లాలాపేట్, సికింద్రాబాద్, బేగంపేట్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, కోఠి, దిల్‌షుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, అల్వాల్, కొండాపూర్, మాదాపూర్‌తో పాటు తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మళ్లీ సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
వర్షాల దృష్ట్యా ఉద్యోగులు తమ ప్రణాళికను ముందుగానే ఖరారు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రమ్ చేయాలని సూచించారు. ట్రాఫిక్ దృష్ట్యా నివాసాలకే పరిమితమైతే బెటర్ అని అధికారులు చెప్పారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram