మూడు వేల కోట్లతో హైదరాబాద్‌లో మరో వెయ్యి కిలోమీటర్ల రహదారుల అప్‌గ్రేడ్‌

హైదరాబాద్‌లో సీఆర్‌ఎంపీ ఫేజ్‌2 పనులకు రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. దీనిలో భాగంగా సుమారు వెయ్యి కిలోమీటర్ల రహదారులను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు.

Hyderabad CRMP Phase2

ట్రాఫిక్‌తో నరకం చూసే హైదరాబాదీలకు శుభవార్త. సీఆర్‌ఎంపీ ఫేజ్‌ 2 కింద 1,045 కిలోమీటర్ల రోడ్‌ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. మొత్తం 3,145 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు ప్రారంభించనున్నారని ఈటీ ఇన్‌ఫ్రా కథనం పేర్కొంటున్నది. గ్రేటర్‌ హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది.

అదనంగా 398 కిలోమీటర్ల రోడ్లు

ఈ ప్రణాళికలో 398.32 కిలోమీటర్ల అప్రోచ్‌ రోడ్లను కూడా ఇన్‌క్లూడ్‌ చేశారు. ఇందులో 97.5 కిలోమీటర్ల మేర జీహెచ్‌ఎంసీ నిధులను ఉపయోగించి రీకార్పెటెడ్‌ చేశారు. ప్రస్తుతం ఈ పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన 300.78 కిలోమీటర్లకు సంబంధించి.. 236.30 కి.మీ. బీటీ రోడ్లు, 64.49 కి.మీ. సీసీ రోడ్లు ఉంటాయి.

పదేళ్లపాటు ప్రాజెక్టుకు జీహెచ్‌ఎంసీ ఫండింగ్‌

3,145 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు జీహెచ్‌ఎంసీ సాధారణ నిధుల నుంచి కేటాయించనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్వీ కర్ణన్‌ చెప్పారు. ఈ కేటాయింపులు 2026–27 నుంచి 2035–36 మధ్య కాలంలో పదేళ్లపాటు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు ఆర్థిక సహాయాన్ని జీహెచ్‌ఎంసీ కోరడం లేదు. టెండర్ల ప్రారంభానికి ముందు డీపీఆర్‌లు సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. అవసరమైన చోట్ల మాత్రమే రీకార్పెటింగ్‌ చేయనున్నారు. మంచి కండిషన్‌లోనే ఉన్న రోడ్లకు సాధారణ మెయింటనెన్స్‌ కొనసాగుతుంది. లేన్‌ మార్కింగ్‌, యంత్రాలతో రోడ్లను శుభ్రపర్చడం, ఫుట్‌పాత్‌లు, మీడియన్స్‌ (రోడ్ల మధ్య ఖాళీ ప్రదేశాలు) అభివృద్ధి చేయడం ఈ ప్రణాళికలో ఉంటుంది. గుంతలు పూడ్చడం, రహదారి సూచికలు ఏర్పాటు చేయడం కూడా ఇందులో భాగం. సీఆర్‌ఎంపీ ఫేజ్‌ 2పై ప్రణాళిక రూపొందించినట్టు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ జారీ చేసిన ఉత్తర్వు పేర్కొంది. ఈ ప్రణాళికను రానున్న పదేళ్లపాటు అమలు చేయనున్నారు.

Read Also |

ఎమ్మెల్యే పల్లాకు సైబర్ నేరగాళ్ల టోకరా..!
House Cleaning | ఇల్లు ఏ దిశ‌లో ఊడ్చాలో తెలుసా సుమా..?
దొంగ చేతిలో స్కూటర్​.. యజమాని చేతికి​ చలాన్ : హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీస్​ సూపర్​!

Latest News