హైదరాబాద్​ అక్షరాలా అగ్నిగుండం – 42.6 డిగ్రీలతో సీజన్​ రికార్డు | రేపటి నుండి ఉపశమనం?

హైదరాబాద్‌లో ఈ సీజన్‌లోనే అత్యధికంగా 42.6°C ఉష్ణోగ్రత నమోదైంది. నగరమంతా హీట్‌వేవ్ తీవ్రత పెరిగింది. అయితే రేపటి తర్వాత వర్షాలతో ఉపశమనం లభించే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

హైదరాబాద్​ అక్షరాలా అగ్నిగుండం – 42.6 డిగ్రీలతో సీజన్​ రికార్డు | రేపటి నుండి ఉపశమనం? హైదరాబాద్ నగరంలో ఎండల తీవ్రతకు బోసిపోయిన రోడ్ల దృశ్యం

Blazing Hyderabad Hits 42.6°C; Weather Turnaround Expected in 48 Hours

హైదరాబాద్‌లో ఎండలు పీక్స్‌కు

నగరంలో 42.6°C వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ హీట్‌వేవ్ తీవ్రత పెరిగింది. అన్ని ప్రాంతాల్లో 42°C పైగా నమోదవడం గమనార్హం. రేపటి తర్వాత వర్షాలతో ఉపశమనం లభించే అవకాశం ఉంది.

 

విధాత వెదర్​ డెస్క్​ | మే 2, 2026 | హైదరాబాద్​:

Hyderabad 42.6°C | హైదరాబాద్ నగరం అక్షరాలా అగ్నిగుండంలా మారింది. ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో 42°C దాటిన ఉష్ణోగ్రతలు నమోదవగా, ముషీరాబాద్ – విఠల్​వాడి ప్రాంతాల్లో 42.6°C నమోదు కావడం గమనార్హం. అయితే… ఇంకో రెండు రోజుల్లో ఉపశమనం కలుగుతుందని  వాతావరణ శాఖ అంచనాలు.

నగరం మొత్తం నిప్పుల కుంపటిఅన్ని ప్రాంతాల్లో 42°C పైగా

People shielding themselves from extreme heat while a man bathes a buffalo to beat the scorching Hyderabad summer

ఎండల తీవ్రత నుంచి రక్షణ కోసం ముఖాలు కప్పుకుంటున్న ప్రజలు… జంతువులకు చల్లదనం కల్పిస్తున్న దృశ్యం

హైదరాబాద్‌లో ఎండలు అన్ని ప్రాంతాలను సమానంగా ప్రభావితం చేస్తున్నాయి. విఠల్​వాడి, ముషీరాబాద్ ప్రాంతాల్లో 42.6°C నమోదు కాగా… చాంద్రాయణగుట్ట, యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో 42.5°C నమోదయ్యాయి.

ఉప్పల్, ఎల్‌బీనగర్, సరూర్​నగర్​, మలక్‌పేట్, ఫలక్‌నుమా, బేగంబజార్, శేరిలింగంపల్లి, బీహెచ్ఈఎల్, బేగంపేట్ వంటి ప్రాంతాల్లో 42.4°C నమోదు కావడం నగరమంతా ఒకే విధమైన హీట్‌వేవ్ ప్రభావం ఉందని స్పష్టంగా చూపుతోంది.

చార్మినార్, కుత్బుల్లాపూర్, మూసాపేట్ ప్రాంతాల్లో 42.3°C, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 42.2°C, ఆల్వాల్‌లో 42.1°C నమోదయ్యాయి.

రేపటితో ముగింపు? వర్ష సూచనలతో ఉపశమనం

People covering faces and protecting themselves from severe heatwave conditions in Hyderabad streets

హైదరాబాద్ వీధుల్లో ఎండల నుంచి రక్షణ కోసం తిప్పలు

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రేపటితో ఈ హీట్‌వేవ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని, పిడుగులు–ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా:

  • మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు బయటకు వెళ్లకూడదు
  • ఎక్కువగా నీళ్లు తాగాలి
  • తేలికపాటి దుస్తులు ధరించాలి

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎండలు శిఖరానికి చేరుకున్నా… ఇంకో 1–2 రోజుల్లో ఉపశమనం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటివరకైతే జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.