Aditya Kedia Realtors | రూ.300 కోట్ల భూమి కబ్జా పై ఆర్డీఓ, తహశీల్దార్ నిర్లక్ష్యం
రంగారెడ్డి జిల్లాలో శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ రూ.300 కోట్లు విలువైన భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు.
Aditya Kedia Realtors | ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే కూలగొట్టాల్సిన రెవెన్యూ అధికారులు మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కబ్జాదారుల నుంచి అమ్యామ్యాలు అందితే ఒక రకంగా అందకపోతే మరో రకంగా ప్రవర్తిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ నగర శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో పదవులకు యమ డిమాండ్ ఉంది. స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ మంత్రి, రెవెన్యూ ఉన్నతాధికారుల అండదండలతో ఆర్డీఓ, తహశీల్దార్ పోస్టులను దక్కించుకుంటున్నారు. భూ కబ్జాదారులు, బిల్డర్లు, రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు కలగలసి వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను చెరబడుతున్నారని, కబ్జాలపై మీడియాలో వార్తలు వచ్చినప్పుడు హడావుడి చేయడం, ఆ తరువాత వదిలేయడం ఆనవాయితీగా మారిందని చర్చించుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల గ్రామం లో శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ మూసీ నదిని కబ్జా చేసినా చర్యలు తీసుకునే సాహసం చేయడం లేదు. అదేమంటే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ హెచ్ఎండీఏ, గండిపేట మండల తహశీల్దార్ తప్పించుకుంటున్నారు. సచివాలయం నుంచి వస్తున్న ఒత్తిడితో కూల్చివేయడం లేదా, రియల్టర్ నుంచి అందాల్సిన మొత్తం అందడంతో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారుల కళ్లకు కన్పించినా కూల్చివేయకుండా వదిలేయడం మూలంగానే రియల్టర్ వేగంగా నిర్మాణాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
మంచిరేవుల గ్రామం, నార్సింగ్ ఓఆర్ఆర్ జంక్షన్ పక్కనే తన 9.19 ఎకరాల భూమిలో బహుళ అంతస్తుల భవనం నిర్మాణం కోసం శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) 2022 మే 12వ తేదీన దరఖాస్తు సమర్పించింది. దరఖాస్తును పరిశీలించిన హెచ్ఎండీఏ అదే సంవత్సరం ఆగస్టు నెలలో 38 అంతస్తుల భవనం నిర్మాణం చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఫిర్యాదు రావడంతో 2023 జూన్ లో మూసీ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణం చేస్తున్నారంటూ గండిపేట మండల రెవెన్యూ అధికారులు, నీటి పారుదల అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, కబ్జా చేసినట్లు నిర్థారణకు వచ్చారు. దీనిపై ఆగస్టు 2న హెచ్ఎండీఏ ప్రణాళిక విభాగం షో కాజ్ నోటీసు పంపించింది. షోకాజ్ నోటీసులో లేవనెత్తిన అంశాలపై రియల్టర్ ఇచ్చిన సమాధానం పై సంతృప్తి చెందని హెచ్ఎండీఏ అనుమతులను రద్ధు చేయడంతో పాటు కాంపౌండ్ వాల్ ను కూల్చేయాలని ఆదేశించింది. దీనిపై రియాల్టర్ హైకోర్టుకు వెళ్లగా, మళ్లీ కొత్తగా తనిఖీలు చేశారు. కాంపౌండ్ వాల్ తొలగించినట్లు రియల్టర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో, మార్చి 1వ తేదీన అనుమతులు పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం హెచ్ఎండీఏ 2024 జూన్ 20 న అనుమతులను పునరుద్ధరించింది. ఇంత వరకు బాగానే ఉంది. కాని కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు మీనమేషాలు లెక్కించారు.
మూసీ సుందరీకరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించడంతో ఈ కబ్జా వివాదం మళ్లీ మొదలైంది. మూసీని మింగేసి శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ నిర్మాణాలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. కూల్చివేయాలంటూ పలువురు హైడ్రా కు ఫిర్యాదు చేశారు. మెదక్ బీజేపీ ఎంపీ ఎం.రఘునందన్ రావు కూడా ఈ అక్రమ నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తామని చెబుతున్న హైడ్రా కూడా చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నదని ఆయన అన్నారు. విమర్శల నేపథ్యంలో హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు లేఖ రాస్తూ, కబ్జా జరిగిందా లేదా అనేదానిపై నివేదిక పంపించాల్సిందిగా కోరింది. హద్దు రాళ్లు తొలగించినందున రీ సర్వే చేసి వాస్తవాలను తేల్చాల్సిందిగా కోరారు. వివాదాస్పద భూమిలో 3.03 ఎకరాలు శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ ఆక్రమించినట్లు గండిపేట తహశీల్దార్, హైడ్రా కమిషనర్ కు లేఖ రాశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్ ఒక ఎకరా భూమి రూ.100 కోట్ల వరకు పలుకుతోంది. అంటే రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారనేది గండిపేట రెవెన్యూ అధికారులు తేల్చారు.
రాజేంద్రనగర్ ఆర్డీఓ, గండిపేట తహశీల్దార్ నిర్లక్ష్యమేనా
మంచిరేవుల లో శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ మూసీ బఫర్ జోన్ లో నిర్మాణం చేపడుతున్నా రాజేంద్రనగర్ ఆర్డీఓ, గండిపేట తహశీల్దార్ లు కూల్చివేయకుండా ప్రేక్షక పాత్ర వహించారని స్థానికులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. వీరిద్దరి అండదండలతోనే రియల్టర్ అక్రమ నిర్మాణం జోరుగా సాగించారని, ప్రతి రెండు వారాలకు ఒక ఫ్లోర్ వేశారంటున్నారు. ఇప్పటికైనా కూల్చివేతలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నా
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram