Bharat Taxi | ఓలా, ఉబర్‌లు ఇక షెడ్డుకేనా!.. రోడ్లపైకి ‘భారత్ ట్యాక్సీ’ వస్తోంది
ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ పేరుతో దేశంలోని తొలి సహకార టాక్సీ సేవలను ప్రవేశపెట్టింది. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా, డ్రైవర్లు తమ సంపూర్ణ ఆదాయంపై హక్కు పొందే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ :
ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ టాక్సీ’ పేరుతో దేశంలోని తొలి సహకార టాక్సీ సేవలను ప్రవేశపెట్టింది. సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) సహకారంతో అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా, డ్రైవర్లు తమ సంపూర్ణ ఆదాయంపై హక్కు పొందే అవకాశం ఉంది. ప్రయాణికులకు ప్రభుత్వ పర్యవేక్షణలో సురక్షితమైన, పారదర్శకమైన క్యాబ్ సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా కేంద్రం ‘భారత్ ట్యాక్సీ’ని ప్రారంభించింది.
గత కొంతకాలంగా వినియోగదారులు, డ్రైవర్లు ఓలా, ఊబర్ ట్యాక్సీ యాప్ సేవలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. డ్రైవర్లు తమకు సరైన ఆదాయం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ప్రయాణికులు క్యాబ్ ల ద్వారా ప్రయాణ ఖర్చు ఎక్కువ అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగడం, అనవసర రద్దులు, వాహనాల పరిశుభ్రత లేకపోవడం, ఆకస్మిక సర్జ్ ప్రైసింగ్ పెంపు వంటి అంశాలు వినియోగదారులను విసిగించగా, డ్రైవర్లు మాత్రం కంపెనీల అధిక కమిషన్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరికి ఒక్కో రైడ్‌పై 25 శాతం వరకు ఆదాయం కోల్పోవాల్సి వస్తోందని తెలుస్తోంది.
అయితే, ఈ ఇబ్బందులకు ప్రత్యమ్నాయంగా ‘భారత్ ట్యాక్సీ’ ని కేంద్ర ప్రభుత్వం సహకార పద్ధతిలో ప్రవేశపెట్టింది. దీని ద్వారా డ్రైవర్లు ప్రతి రైడ్ పై ఎలాంటి కమిషన్లు చెల్లించాల్సిన అవసంర ఉండదు. దీంతో డ్రైవర్ల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. కాగా, ఈ యాప్ పైలట్ ప్రాజెక్టుగా నవంబర్ లో ఢిల్లీలో 650 ట్యాక్సీలతో ప్రారంభం కానుంది. తరువాత డిసెంబర్ లో దేశ వ్యాప్తంగా ‘భారత్ ట్యాక్సీ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి సంవత్సరం ముంబై, పుణే, భోపాల్, లక్నో, జైపూర్ తదితర నగారాల్లో విస్తరించనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram