AI-driven Smart Highway | దేశంలో మొట్టమొదటి ఏఐ డిజిటల్​ స్మార్ట్​​ హైవే హైదరాబాద్​ నుండే..

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి (NH-65)ను రూ.10,391 కోట్ల వ్యయంతో ఆరు వరుసల AI స్మార్ట్ హైవేగా విస్తరించనున్నారు. సోలార్ లైట్స్‌, AI కెమెరాలు, భద్రతా బారికేడ్లు, పారిశ్రామిక అనుసంధానాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగం.

AI-driven Smart Highway | దేశంలో మొట్టమొదటి ఏఐ డిజిటల్​ స్మార్ట్​​ హైవే హైదరాబాద్​ నుండే..

Hyd-Vijayawada NH 65 to become AI-driven Digital Smart Secured Highway soon

  • హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారి ఇక హై సెక్యూరిటీ స్మార్ట్​ హైవే!
  • దేశంలోనే మొట్టమొదటి ఏఐ డిజిటల్​ స్మార్ట్​ సెక్యూర్డ్​ హైవే
  • నాలుగు నుండి ఆరు వరుసలుగా ఎన్​హెచ్​65 విస్తరణ
  • ఏఐ స్మార్ట్​ కెమెరాలతో అత్యాధునిక ట్రాఫిక్​ నిర్వహణ వ్యవస్థ
  • రోడ్డు మధ్యలో ప్రత్యేక మొక్కలతో పచ్చదనం

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-65) త్వరలో పూర్తిస్థాయి హై సెక్యూరిటీ స్మార్ట్ హైవేగా రూపుదిద్దుకోనుంది. ఈ రహదారిని నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించి, ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలతో స్మార్ట్ రోడ్డుగా మార్చనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

మైసమ్మ ఆలయం నుండి కనకదుర్గమ్మ ఆలయం వరకు

ఈ ప్రాజెక్టు మల్కాపూర్‌ ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం వరకు 231.32 కిలోమీటర్ల మేర సాగుతుంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) ప్రకారం, మొత్తం వ్యయం ₹10,391.53 కోట్లుగా అంచనా వేయబడింది. ఇందులో నిర్మాణ వ్యయం రూ.6,775.47 కోట్లు, ఇతర మౌలిక అవసరాల కోసం రూ.3,616.06 కోట్లు కేటాయించనున్నారు. ఈ DPR రూపకల్పన దాదాపు పూర్తికావడంతో, 2026 ఏప్రిల్–మేలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఏఐ కెమెరాల నిఘా, సోలార్ లైట్స్‌తో 24 గంటల భద్రతా పర్యవేక్షణ

Hyderabad–Vijayawada NH65 Digital Smart Highway Project with AI Surveillance, Solar Streetlights, and 6-Lane Expansion

ఈ రహదారిని భద్రతా పరంగా అత్యంత పటిష్ఠంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి కిలోమీటర్‌కు రెండు వైపులా ఒక్కొక్కటి చొప్పున మొత్తం 231 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) సాంకేతికతతో అనుసంధానం అవుతాయి. కెమెరాలు 360 డిగ్రీల కోణంలో పనిచేసి, స్పీడ్ డిటెక్షన్‌, రాంగ్ రూట్‌ డ్రైవింగ్‌, ప్రమాదాల వంటి సంఘటనలను రికార్డ్​ చేసి వెంటనే ఆ వీడియోలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కి లొకేషన్‌ వివరాలతో సహా పంపిస్తాయి.

ఈ స్మార్ట్ సిస్టమ్‌ను రాష్ట్ర పోలీసు, రవాణా శాఖ కమాండ్ సెంటర్లతో కూడా అనుసంధానం చేయనున్నారు. దీని ఫలితంగా రహదారిపై జరిగే ప్రతి సంఘటనను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. ఈ వ్యవస్థ వల్ల ప్రమాదాలు పెద్ద ఎత్తున తగ్గుతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా దృష్ట్యా రహదారికి ఇరువైపులా ఆర్‌సీసీ బారికేడ్లు, మెటల్ బీమ్స్, క్రాష్ బ్యారియర్స్ ఏర్పాటు చేస్తారు. సోలార్ వీధి దీపాలు, వర్షపు నీటిని ఒడిసిపట్టే నీటిపారుదల వ్యవస్థ, రోడ్డుకు ఇరువైపులా , మధ్యలో మొక్కల వంటి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

ప్రమాదాలు తరచుగా జరిగే 38 ప్రదేశాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, అలాగే 17 బ్లాక్‌స్పాట్‌ల వద్ద ఓవర్‌బ్రిడ్జీలు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. రహదారిపై భవిష్యత్​ అవసరాల దృష్ట్యా నీటి పైప్‌లైన్లు, గ్యాస్ లైన్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లు, హైటెన్షన్ విద్యుత్ లైన్లు నిర్మాణ సమయంలోనే ఏర్పాటు చేయనున్నారు.

వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు ఊతంగా ఈ స్మార్ట్ హైవే

ఈ విస్తరణ ప్రాజెక్ట్‌ కేవలం రవాణా భద్రతకే కాకుండా, ఆర్థికాభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించనుంది. హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారికి 50 ఇండస్ట్రియల్ పార్కులు, 20 ఎకనామిక్ నోడ్స్‌, 4 నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ (NICDC) ప్రాజెక్టులు అనుసంధానం కానున్నాయి.

ఇతర జాతీయ రహదారులు, రాష్ట్ర రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలతో కూడా ఈ హైవే కనెక్ట్ అవుతుంది. 2 మేజర్ రైల్వే స్టేషన్లు, 2 విమానాశ్రయాలు, 2 టెక్స్టైల్ క్లస్టర్లు ఈ మార్గం ద్వారా సులభంగా గమ్యానికి చేరుకోగలవు.

ప్రస్తుతం రోజుకు సగటున 43,742 వాహనాలు ఈ రహదారిపై సంచరిస్తుండగా, 2035 నాటికి 71,251, 2048 నాటికి 1,71,251 వాహనాల వరకు పెరుగుతుందని అంచనా. ఈ హైవే పూర్తి స్థాయిలో సిద్ధమైన తరువాత, హైదరాబాద్‌ నుంచి విజయవాడ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. వ్యాపార లావాదేవీలు, రవాణా సౌకర్యాలు మరియు పారిశ్రామిక ప్రగతి వేగం మరింత పెరుగుతుంది.

The Hyderabad–Vijayawada National Highway (NH-65) is being transformed into a high-security AI-driven digital secured smart highway.
The ₹10,391 crore project covers 231 km between Malkapur and Vijayawada, expanding it from 4 to 6 lanes.
With 231 AI-integrated CCTV cameras, solar streetlights, rainwater management, and safety barricades, this digital corridor aims to enhance safety, reduce accidents, and improve connectivity. It will link major industrial parks, economic zones, and transport hubs across Telangana and Andhra Pradesh.