Jubilee Hills By-Election | జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీకే జనసేన మద్దతు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పూర్తి మద్దతు ప్రకటించింది.
విధాత: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జన సేన పార్టీ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించింది. జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, పలువురు పార్టీ రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి తమపార్టీ మద్దతు ప్రకటించారు. లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లుగా జనసేన పార్టీ నాయకులు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతుతో ఈ నియోజకవర్గంలో గణనీయ సంఖ్యలో ఉన్న సినీ కార్మికులు.. సెటిలర్ల ఓటర్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram