Liquor Shops Closure : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక..మద్యం షాప్ లు బంద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 9 సాయంత్రం నుంచి 11 సాయంత్రం వరకు, అలాగే 14న ఓట్ల లెక్కింపు రోజున మద్యం షాపులు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సైబరాబాద్ జోన్ పరిధిలో ఈ నెల 9 సాయంత్రం 6గంటల నుంచి పోలింగ్ జరిగే 11వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఓట్ల లెక్కింపు జరిగే ఈ నెల 14వ తేదీ కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు గురువారం నుంచి హోమ్ ఓటింగ్ (ఇంటి దగ్గర నుంచే ఓటు) సదుపాయం అమల్లోకి వచ్చింది. ఇవాళ, ఎల్లుండి ఇంటి వద్దనే ఓటు వేసేందుకు వికలాంగులు, వృద్ధులకు అవకాశం ఉంటుంది. హోమ్ ఓటింగ్‌కి 84 మంది వృద్ధులు, 19 మంది వికలాంగులు దరఖాస్తు చేసుకున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram