Kavitha : హరీష్ రావుకు కవిత పరామర్శ
పితృ వియోగానికి గురైన బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్ రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్లి తండ్రి సత్యనారాయణరావు చిత్రపటానికి నివాళులర్పించారు.
విధాత, హైదరాబాద్ : పితృ వియోగానికి గురైన బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరామర్శించారు. హరీష్ రావు ఇంటికి వెళ్లిన కవిత ఆయన తండ్రి సత్యనారాయణ రావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతర హరీష్ రావు కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్, కవితలు అర్దగంటకుపైగా భేటీ అయ్యారు. కవిత వెంట ఆమె భర్త దేవనపల్లి అనిల్ కుమార్ కూడా ఉన్నారు.
అయితే కవితపై హరీష్ రావు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో కవిత పరామర్శించిన ఫోటోలను హరీష్ రావు వర్గాలు బయటకు విడుదల చేయలేదు. అయితే కవిత అనుచరులు సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం కవిత జనం బాట యాత్రలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. యాత్ర మధ్యలో ఆమె హైదరాబాద్ కు వచ్చి హరీష్ రావును పరామర్శించి తిరిగి యాత్ర నిర్వహణకు బయలుదేరి వెళ్లిపోయారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram