బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసుల జారీ

పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్‌పై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో భగీరథ్ లొంగిపోవచ్చన్న ప్రచారం సాగుతోంది.

మైనర్ బాలికపై అఘాయిత్యం ఆరోపణలపై ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారుే. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ లలో పోలీసు బృందాలు బండి భగీరథ్ కోసం గాలిస్తున్నాయి. భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసాల్లోనూ పోలీసులు సోదాలు చేపట్టారు.

లొంగుబాటలో బండి భగీరథ్

తన అరెస్టు కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం..హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించకపోవడంతో పరారీలో ఉన్న బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. న్యాయవాదులలో కలిసి మరికొన్ని గంటల్లో పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్ లో భగీరథ్ లొంగిపోనున్నట్లుగా ప్రచారం చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో బండి భగీరథ్ పై ఫోక్సో కేసుతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద పేట్ బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్లు కేసు నమోదైంది. అటు బాధిత బాలిక కుటుంబంపై భగీరథ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ టౌ టౌన్ పోలీస్ స్టేషన్ లో హనీ ట్రాప్ కేసు నమోదైంది.

తనపై నమోదైన ఫోక్సో కేసులో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా..హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే కేసు నమోదు అనంతరం భగీరథ పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉండటంతో ఆయన కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి :

వైరల్..వృద్ధ దంపతులపై అమాన‌వీయ చ‌ర్య‌
బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి తాత మృతి!

Latest News