లొంగిపోయిన బండి భగీరథ్
మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడన్న ఆరోపణలపై ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. భగీరథ్ స్వయంగా తన న్యాయవాదులతో కలిసి సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) కార్యాలయానికి వచ్చి శనివారం మధ్యాహ్నంకు ముందే పోలీసుల ఎదుట లొంగిపోయాడు.
విధాత, హైదరాబాద్ : మైనర్ బాలికపై అఘాయిత్యం చేశాడన్న ఆరోపణలపై ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసులకు లొంగిపోయాడు. భగీరథ్ స్వయంగా తన న్యాయవాదులతో కలిసి సీపీ (కమిషనర్ ఆఫ్ పోలీస్) కార్యాలయానికి వచ్చి శనివారం మధ్యాహ్నంకు ముందే పోలీసుల ఎదుట లొంగిపోయాడు. లొంగిపోయిన బండి భగీరథ్ ను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. వైద్య పరీక్షల అనంతరం నిందితుడిని మేడ్చల్ మేజిస్ట్రేట్ నివాసంలో లేదా కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. ఈ కేసులో న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
భగీరథ్ దేశం దాటి వెళ్లిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఐదు బృందాలతో గాలిస్తున్న నేపథ్యంలో అతని లొంగుబాటు పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
బండి భగీరథ అరెస్ట్ : సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి
బండి భగీరథను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి తెలిపారు. నార్సింగిలోని పోలీస్ అకాడమీ సమీపంలో బండి భగీరథను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ప్రస్తుతం ఆయనను పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు.
చట్టంపై గౌరవంతో పోలీసులకు అప్పగించా: బండి సంజయ్
చట్టంపై గౌరవంతో తన కుమారుడు బండి భగీరథ్‌ను పోలీసులకు అప్పగించానని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయవాదులల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించినట్లు పేర్కొన్నారు. చట్టం ముందు నా బిడ్డ అయినా, సామాన్యుడైనా సమానమేనని.. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని మా అబ్బాయి పదే పదే చెబుతున్నాడు అని తన ప్రకటనలో సంజయ్ పేర్కొన్నారు. ఆధారాలు చూపేందుకే భగీరథ్ అప్పగింతలో ఆలస్యమైందన్నారు.
మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్ములాలు
బండి భగీరథ్ కేసులో బాధిత బాలిక, ఆమె తల్లి వాంగ్ములాలను మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట శనివారం మరోసారి నమోదు చేశారు. 164 CrPC కింద వారి వాంగ్ములాలు నమోదు చేశారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఛాంబర్లో దాదాపు 40 నిమిషాల పాటు బాధితురాలు, ఆమె తల్లి కోర్టుకు అసలేం జరిగిందనే వివరాలను వెల్లడించినట్లుగా సమాచారం. పోలీసులు ఇప్పటికే బాధితురాలి నుంచి రెండు సార్లు వాంగ్మూలం నమోదు చేయగా..ఇప్పుడు మేజిస్ట్రేట్ ముందు రికార్డైన స్టేట్మెంట్ ఈ కేసులో మరింత కీలకం కానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram