బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి తాత మృతి!

నల్గొండ జిల్లా ఊట్లపల్లిలో బోరుబావిలో పడిన మనవడిని కాపాడేందుకు దిగిన తాత వెంకన్న ఊపిరాడక మృతి చెందాడు. బాలుడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | May 16, 2026, 12:33 pm IST
Read Time: 2 mins
బోరుబావిలో పడిపోయిన మనవడిని రక్షించబోయి తాత మృతి!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పొలం వద్ద ఉన్న బోరుబావిలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన తాత వెంకన్న (50) కూడా అందులో చిక్కుకున్నాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి బోరుబావి నుంచి వారిద్దరినీ బయటకు తీశారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా ఊపిరాడక తాత వెంకన్న తీవ్ర అస్వస్థతకు గురై మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాలుడికి చికిత్స కొనసాగుతోంది. తాత వెంకన్న మృతితో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో పడిపోయారు.

 

ఇవి కూడా చదవండి :

సంక్షేమ పథకాల అమలుపై ‘సర్’ దెబ్బ
బండి భగీరథ్ కు హైకోర్టు షాక్