బండి భగీరథ్ ఫోక్సో కేసు విచారణ పారదర్శకంగా కొనసాగేందుకు వీలుగా కేంద్ర హోంశాఖ మంత్రి పదవి నుంచి బండి సంజయ్ ని తొలగించాలని కోరతూ బాధిత మైనర్ బాలిక ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. సంజయ్‌ని మంత్రి పదవి నుండి తొలగించాలని బాధితురాలి తరపు న్యాయవాది పప్పు నాగేశ్వర రావు ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి లేఖ రాశారు.
బండి సంజయ్ మంత్రి పదవిలో ఉంటే కేసును పక్కదారి పట్టిస్తాడు అని, ఇటీవలే బహిరంగంగా బెదిరింపులకు కూడా దిగాడు అంటూ బాధితురాలు తరపు న్యాయవాది తన లేఖలో పేర్కొన్నారు.
మైనర్ బాలికపై అఘాయిత్యం ఆరోపణలపై ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ పై తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నాలుగు బృందాలుగా ఏర్పడి భగీరథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారుే. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ లలో పోలీసు బృందాలు బండి భగీరథ్ కోసం గాలిస్తున్నాయి. భగీరథ్ తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసాల్లోనూ పోలీసులు సోదాలు చేపట్టారు. మరోవైపు భగీరథ్ పేట్ బషీర్ బాగ్ పోలీసుల ముందు లొంగిపోతున్నట్లుగా సమాచారం.
ఇవి కూడా చదవండి :
బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసుల జారీ
ఇంధన ధరల పెంపు.. మోదీ విశ్వాస ఘాతకం: సీఎం రేవంత్ రెడ్డి
