Bandi Bhageerath | బండి భగీరథ్ పై ‘పొక్సో’ కేసులో ఆరని అగ్గి.. కాంగ్రెస్ పార్టీ కే ఎక్కువ నష్టం జరిగిందా?
Bandi Bhageerath మైనర్ బాలిక పై అత్యాచారం చేశారని పొక్సొ కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ సంఘటన సృష్టించిన రాజకీయ మంటలు రాష్ట్రంలో రగులుతూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ రాజకీయ జ్వాలలు ఆరిపోయే అవకాశం లేదంటున్నారు.
బీజేపీ రెండు నాల్కల ధోరణితో వ్యహహారం
కేటీఆర్, సంజయ్ మధ్య పతాక స్థాయి రచ్చ
సీఎం రేవంత్ రెడ్డి పైన ‘కుమ్మక్కు’ ఆరోపణ
Bandi Bhageerath | విధాత, ప్రత్యేక ప్రతినిధి: మైనర్ బాలిక పై అత్యాచారం చేశారని పొక్సొ కేసులో ఇరుక్కున్న బండి భగీరథ్ సంఘటన సృష్టించిన రాజకీయ మంటలు రాష్ట్రంలో రగులుతూనే ఉన్నాయి. ఇప్పట్లో ఈ రాజకీయ జ్వాలలు ఆరిపోయే అవకాశం లేదంటున్నారు. ఈ సంఘటనలో బీజేపీ కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికే ఎక్కువ నష్టం వాటిల్లిందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
నిందితుడు భగీరథ్ తండ్రి, బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మధ్య సాగుతున్న దూషణల పర్వం పతాక స్థాయికి చేరింది. బహిరంగ వేదికలపై, మీడియా సమావేశాలు, సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్న ఆరోపణలు, విమర్శలు జుగుప్సాకరంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో బండి సంజయ్ ను కేంద్ర మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలంటూ తాజాగా బీఆర్ఎస్ డిమాండును తెరపైకి తెచ్చింది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో నిరసనలను కూడా చేపట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేరెళ్ళ లాంటి సంఘటనల్లో ఆ నాయకుల వ్యవహార శైలి, తాజాగా బీఆర్ఎస్ నేతల పైన డ్రగ్స్, ఇతరత్రా ఆరోపణలు వ్యక్తమైన సంఘటనల్లో వారి తీరు ఏ విధంగా ఉన్నప్పటికీ, బండి భగీరథ్ కేసులో పార్టీ దూకుడు వల్ల ఈ మేరకు రాజకీయ మైలేజీ లభించిందనే చర్చ సాగుతోంది.
ఈ సంఘటన పై తొలుత సాధారణ స్థాయిలో స్పందించిన బీఆర్ఎస్, ఆ తర్వాత గేరు మార్చి… ముందుందనే అభిప్రాయం నెలకొంది. ఇదిలా ఉండగా ఈ సంఘటనలో కేసు నమోదు, నిందితుడి అరెస్టులో జరిగిన జాప్యంతో ప్రభుత్వం పై ఆరోపణలు, ప్రధాన మీడియా తీరు పై విమర్శలు వెల్లువెత్తాయి. సీఎం చెప్పినట్లు సున్నితమైన కేసే అయినప్పటికీ మెజార్టీ ‘మంత్రులు’ స్పందించాల్సి పరిధిలో కూడా ‘ మౌనం’ పాటించడం చర్చకు, అనుమానాలకు దారితీసింది.
కాంగ్రెస్ సర్కారు ‘మూల్యం’
ఇదిలా ఉండగా బండి భగీరథ్ కేసులో స్పందించాల్సిన తీరులో స్పందించకపోవడమే కాకుండా, పోలీసులు, ప్రభుత్వం అనుసరించిన ‘జాప్యం’ అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ సంఘటనలో బండి సంజయ్, బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి కూడా ‘ జరుగాల్సినంత’ నష్టం జగిందనే అభిప్రాయం బలంగా ఉంది. ఈ పొక్సొ కేసు నిందితుడు బండి భగీరథ పై ‘సకాలం’లో కేసు నమోదు చేయడంలో జాప్యం చేశారని, తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర పోలీసులంతా కళ్ళల్లో వత్తులేసుకుని వెదికినా దొరకక పోవడంతోపాటు ఆఖరికి అరెస్టో? … సరెండరో? చెప్పలేని నాటకీయ పరిణామాల మధ్య భగీరథ్ను అదుపులోకి తీసుకోవడం తదితర పరిణామాల పై పోలీసులు, ప్రభుత్వం పై విమర్శలు వెల్లువెత్తాయి. భగీరథ్ ను రక్షించేందుకు చివరి వరకు ప్రయత్నించారని, హైకోర్టు మధ్యంత బెయిల్ నిరాకరణతో తప్పని సరి పరిస్థితిల్లో భగీరథ్ ను అరెస్టుచేశారంటూ ఈ మొత్తం ఎపిసోడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పై పెద్ద ఎత్తున కుమ్మక్కు ఆరోపణలొచ్చాయి. ఈ మేరకు బీఆర్ఎస్ బహిరంగంగా విమర్శలు చేసింది.
చివరికి ఈ పొక్సొ కేసుకు సంబంధించిన అంశాలన్నింటిని సీఎం రేవంత్ మీడియా ముఖంగా తాజాగా వివరణ ఇచ్చినప్పటికీ… బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, ప్రవీణ్ కుమార్ లు సీఎం రేవంత్ తీరును బహిరంగంగానే విమర్శించారు. ఇక ఈ వ్యవహారంలో ముందు కరీంనగర్ వేదికగా బాలిక పైన్నే కేసు నమోదు కావడం, ఈ వ్యవహారాన్ని ‘హానీట్రాప్’ గా చిత్రీకరించే ప్రయత్నం, ఒక వర్గం మీడియా పథకం ప్రకారం సహకరించడం, బాలిక తల్లి ఫిర్యాదు పై కేసు నమోదు చేయకుండా పోలీసులు జాప్యం చేయడం, ఆ తర్వాత నిందితున్ని తొమ్మిది రోజుల పాటు అరెస్టు చేయకుండా… బండిసంజయ్ ఇంట్లో సోదాల డ్రామాలు చేశారంటూ వివిధ ఆరోపణలు వచ్చాయి.
ఈ కేసులో బెయిల్ కోసం చేసిన ప్రయత్నం విఫలం కావడంతో అరెస్టా? సరెండరా? అనే రీతిలో కేసుకు హైకోర్టు తీర్పుతో ఏర్పడిన పరిస్థితుల్లో ముగింపు పలికేందుకు యత్నించారని పలువురు భావిస్తున్నారు. ఈ సంఘటనకు తెరలేసినప్పటి నుంచి బండి భగీరథ్ అరెస్టు జరిగే వరకు ఇతర కేసుల్లో పోలీసులు ఎంత యాక్టివ్ గా వ్యవహరిస్తారో? ఆ విధంగా చేయకపోవడమే కాకుండాఉద్దేశ్యపూర్వక జాప్యం చేశారనే భావన నెలకొంది. ఈ కేసులో బాధితురాలి కుటుంబాన్ని బెదిరించినట్లు, నిందితునికి సహకరించినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, మరి కొందరు బీజేపీ నాయకుల పైన ఎందుకు కేసు నమోదు చేయలేదనే ప్రశ్నలకు సరైన సమాధానం లేదు.
బీజేపీ రెండు నాల్కల ధోరణి?
బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణలు, నమోదైన కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరించడంలో బీజేపీ నాయకత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా తన కుమారిడి పై ఆరోపణలు వ్యక్తమైన సందర్భంలో కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ హైదరాబాద్ బీజేపీ సభలో, ఆ తర్వాత కరీంనగర్లో ర్యాలీ నిర్వహించి బహిరంగంగా మాట్లాడిన అంశాలు కూడా తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఈ మేరకు వివిధ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు సంజయ్ తీరును విమర్శించాయి. ఏ చిన్న సంఘటన జరిగినా నిరసనలు, ఊరేగింపులు నిర్వహించే బీజేపీ మహిళా నేతలు, బీజేపీ అగ్ర నాయకులు నోరు మెదపకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిన్నమొన్న పశ్చిమ బెంగాల్ లో జరిగిన సంఘటనల పై దేశమంతా ప్రచారం చేసి, మమత పై విమర్శలు చేసిన బీజేపీ నాయకులు భగీరథ్ వ్యవహారంలో కిమ్మనకుండా, సోషల్ మీడియా ద్వారా ‘సమర్ధించు’కునేందుకు యత్నించడం, ఇతర పక్షాలపై ఆరోపణలు చేయడం, ఫలానా కేసులో మీరు స్పందించరా? అంటూ ఎదురుదాడికి దిగడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం భగీరథ జైలుకెల్లినప్పటికీ ఈ సంఘటనలో ఆయా రాజకీయ పక్షాలు, మహిళా, ప్రజాసంఘాలు, నాయకులు, పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం రాజకీయ విమర్శలు చేసేందుకు అవకాశం కల్పించినట్లేననే చర్చసాగుతోంది. ఇప్పట్లో ఈ పొక్సొ కేసు రాజకీయ కుంపటి ఆరిపోయే అవకాశం లేదంటున్నారు.
Read More:
హైదరాబాద్‌లో పరుగులు పెట్టనున్న టెస్లా కార్లు.. త్వరలో సేల్స్, సర్వీస్ సెంటర్
పోలీస్ ఫిర్యాదులకు బహుభాషా ‘ఏఐ కాపీరైటర్’ యాప్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram