iBomma Immadi Ravi : ఐబొమ్మ రవికి ఐదు రోజుల కస్టడీ
ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల కస్టడీ మంజూరు చేసింది. పైరసీ మూవీ రాకెట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం.
విధాత, హైదరాబాద్ : సినిమాల పైరసీ వైబ్ సైట్ ఐబొమ్మ కేసులో నిందితుడు ఇమ్మడి రవి కస్టడీ పిటిషన్ ను నాంపల్లి కోర్టు అనుమతించింది. వారం రోజుల కస్టడీ కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఐదు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్‌లో కీలక సూత్రధారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కొత్త సినిమాలు విడుదలవ్వగానే..ఆ వెంటనే ఐబొమ్మ వైబ్ సైట్ లో ప్రత్యక్షమవ్వడంతో సినీ నిర్మాతలు భారీగా నష్టాలు ఎదుర్కొన్నారు.
పైరసీ వైబ్ సైట్ల కారణంగా వేల కోట్ల నష్టాలను నిర్మాతలు ఎదుర్కోవడంతో సినీ పైరసీ వెబ్ సైట్ల ఆట కట్టించేందుకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అన్ని పైరసీ వెబ్ సైట్లను క్లోజ్ చేయించడంతో సఫలీకృతులయ్యారు. చివరగా దమ్ముంటే నన్ను పట్టుకోండంటూ సవాల్ విసిరిన ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసి పైరసీ వెబ్ సెట్ ల ఆట కట్టించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram