KTR SIT Investigation | ఫోన్ ట్యాపింగ్ బ్లాక్ మెయిల్ తో ఎలక్ట్రోరల్ బాండ్లు : కేటీఆర్ కు సిట్ ప్రశ్నలు?

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్‌కు సిట్ ప్రశ్నల వర్షం! రాధాకిషన్ రావుతో ముఖాముఖి విచారణ. ఎలక్ట్రోరల్ బాండ్ల వసూళ్లపై ఆరా. రాజకీయాల్లో ఉత్కంఠ..

KTR SIT Investigation | ఫోన్ ట్యాపింగ్ బ్లాక్ మెయిల్ తో ఎలక్ట్రోరల్ బాండ్లు : కేటీఆర్ కు సిట్ ప్రశ్నలు?

విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో ఏ4గా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి ఇద్దరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాధాకిషన్‌రావు 2023 ఎన్నికల సమయంలో కొందరు నేతల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు గతంలో విచారణ సందర్బంగా వాంగ్మూలం ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ వ్యతిరేకుల ఫోన్లపై నిఘా పెట్టామని చెప్పారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్‌, రాధాకిషన్‌రావును కలిపి ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు రాధాకిషన్‌రావు చెప్పిన అంశాలపై సమాచారముందా? అని కేటీఆర్‌ను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ తో వ్యాపారులను బెదిరించారని వారి నుంచి బలవంతంగా ఎలక్ట్రోరల్ బాండ్లు రాయించుకున్నారన్న సంధ్యా శ్రీధర్ రావు ఆరోపణల నేపథ్యంలో కూడా సిట్ కేటీఆర్ ను ప్రశ్నించినట్లుగా సమాచారం. అలాగే కేటీఆర్ సోదరి కవిత తన భర్త అనిల్ ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేయించారన్న ఆరోపణలపై కూడా కేటీఆర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. ఎస్‌ఐబీకి టెక్నికల్‌ కన్సల్టెంట్‌గా ఉన్న రవిపాల్‌, ఎమ్మెల్సీ నవీన్‌రావు, శ్రవణ్‌రావు, ప్రణిత్ రావులతో సంబంధాలపై సిట్‌ ప్రశ్నిస్తున్నట్లుగా లీక్ లు వెలువడుతుండటంతో కేటీఆర్ సిట్ విచారణ ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి :

Tata Sierra vs Mahindra Xuv : సియెరా వర్సెస్ మహీంద్రా ఎక్స్ యూవీ..అమ్మకాలలో కొత్త రికార్డ్సు!
Shamshabad Lagacharla Road | శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!