Kaleshwaram PC Ghosh Report Case : కాళేశ్వరం ఘోష్ కమిషన్ రిపోర్టు కేసు విచారణ వచ్చే నెల 25కు వాయిదా
కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై విచారణ ఫిబ్రవరి 25కు వాయిదా! అప్పటి వరకు కేసీఆర్, హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశం.
విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై దాఖలైన పిటిషన్ల విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే నెల 25కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 20లోపు లిఖితపూర్వకమైన సబ్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
కాళేశ్వరంలో జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్‌కె జోషి, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. కేసీఆర్, హరీష్ రావ్ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ సుందరం వాదనలు వినిపించారు.
ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. ప్రభుత్వ కౌంటర్‌కు పిటిషనర్లు రిప్లై ఫైల్ చేశారు. రిప్లైకు ప్రభుత్వం రిటన్ సబ్మిషన్ ఇచ్చేందుకు సమయం కావాలని హైకోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. ఫిబ్రవరి 20లోపు లిఖితపూర్వకమైన సబ్మిషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. అప్పటి వరకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
Jr NTR | సీనియర్ హీరోల పట్ల ఎన్టీఆర్ వినయం.. తారక్ మాటలకి చిరంజీవితో పాటు అందరు ఫిదా
Renu Desai : కుక్క కాటు మరణాలపైనే రచ్చ ఎందుకు? : రేణు దేశాయ్ ఫైర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram