1,200ఏళ్ల చెట్టు..అంతరించిపోతుంది..!

మడగాస్కర్‌లోని 1,200 ఏళ్ల పురాతన బాబాబ్ చెట్టు వాతావరణ మార్పులు, కరువు ప్రభావంతో క్రమంగా అంతరించిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.

1,200ఏళ్ల చెట్టు..అంతరించిపోతుంది..!

ప్రకృతి ప్రయాణానికి నిలువెత్తు సాక్ష్యంగా 1,200 ఏళ్ల సుదీర్ఘ వయసుతో ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన మడగాస్కర్‌లోని అతిపెద్ద బాబాబ్ వృక్షం(“త్సిటకాకాంత్సా”) క్రమంగా అంతరించిపోతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వయస్సు, వాతావరణ ఒత్తిడితో బాబాబ్(అడాన్సోనియా గ్రాండిడియెరి) వృక్షం క్రమంగా కూలిపోవడం ప్రారంభించింది. మోరోంబే సమీపంలోని అండోంబిరి ప్రాంతంలో వెయ్యి సంవత్సరాలకు పైగా కరువులను తట్టుకుని నిలబడటానికి ఈ ప్రాంతా ప్రజలకు ఈ చెట్టు ఎంతగానో సహాయపడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పురాతన మహావృక్షం మడగాస్కర్ యొక్క విశిష్టమైన జీవవైవిధ్యానికి చిహ్నంగా ఇన్నాళ్లు ఠీవిగా నిలబడి ఇప్పుడు తన ఉనికిని కోల్పోతుండటం స్థానికులను విషాదానికి గురి చేస్తుంది.

సుమారు 29 మీటర్ల చుట్టుకొలత గల భారీ కాండం ఉన్నప్పటికీ చెట్టు పురాతనమైపోవడంతో అది క్రమంగా మనుగడను కోల్పోతూ అంతరించిపోతుంది. స్థానిక ప్రజలు “అడవి తల్లి” లేదా “జీవ వృక్షం”గా ఈ చెట్టు పూజించబడుతుంది. మలగాసీ సమాజాలలో బాబాబ్ చెట్లకు ఉన్న ప్రగాఢ ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ, ఒక సాంస్కృతిక చిహ్నంగా, నీటి రిజర్వాయర్‌గా కూడా ఉపయోగపడుతు వచ్చింది.

బాబాబ్ చెట్లు కరువుకు అనుగుణంగా తమ మెత్తటి కాండాలలో 100,000 లీటర్ల వరకు నీటిని నిల్వ చేసుకుంటాయి. అయినప్పటికీ, 2018లో ‘నేచర్ ప్లాంట్స్’ పత్రికలో ప్రచురించిన ఒక అధ్యయనం, తీవ్రమైన కరువు , ఉష్ణోగ్రత మార్పుల కారణంగా తొమ్మిది పురాతన ఆఫ్రికన్ బాబాబ్ చెట్లు అకస్మాత్తుగా చనిపోయినట్లు నమోదు చేసింది. తాజాగా మరో భారీ పురాతన బాబాబ్ చెట్టు కూడా కనుమరుగైపోతుండటం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

దేశంలోని తొలి ఆల్గే చెట్టు…యాంత్రిక హరిత విప్లవం
మ్మడి రాష్ట్రంలో ఎదురైన కష్టాలే రైతులకు మళ్లీ దాపురించాయి: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి