Rashmika | ‘కాక్‌టెయిల్-2’ ఈవెంట్‌లో హీరో ప్ర‌వ‌ర్త‌న‌తో అసౌక‌ర్యంగా ఫీలైన‌ రష్మిక .. వైర‌ల్ వీడియోపై చ‌ర్చ‌

Rashmika | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంధాన ప్రస్తుతం దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా కొనసాగుతున్నారు. ఆమె నటిస్తున్న క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘కాక్‌టెయిల్-2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్, కృతి స‌న‌న్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు హోమి అడజానియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

  • By: Sandeep |    movies |    Published on : May 18, 2026 3:57 PM IST
Rashmika | ‘కాక్‌టెయిల్-2’ ఈవెంట్‌లో హీరో ప్ర‌వ‌ర్త‌న‌తో అసౌక‌ర్యంగా ఫీలైన‌ రష్మిక .. వైర‌ల్ వీడియోపై చ‌ర్చ‌

Rashmika | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంధాన ప్రస్తుతం దక్షిణాది చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా కొనసాగుతున్నారు. ఆమె నటిస్తున్న క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘కాక్‌టెయిల్-2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో షాహిద్ క‌పూర్, కృతి స‌న‌న్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు హోమి అడజానియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ముంబైలో చిత్ర బృందం భారీ స్థాయిలో ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో నిర్వహించిన మ్యూజికల్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.

అసౌక‌ర్యానికి ఫీలైన ర‌ష్మిక‌..

వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, ఈవెంట్ సందర్భంగా షాహిద్ కపూర్, రష్మిక మందన్న కలిసి మీడియా కెమెరాలకు పోజులు ఇస్తున్నారు. ఆ సమయంలో షాహిద్ రష్మిక భుజంపై చేయి వేసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అనంతరం రష్మిక కొద్దిగా పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపించడం సోషల్ మీడియాలో చ‌ర్చ‌కి కారణమైంది.

అయితే ఈ వీడియో ఆధారంగా సోషల్ మీడియాలో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు రష్మిక ఆ సమయంలో అసౌకర్యంగా ఫీలైనట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండగా, మరికొందరు వీడియోలోని కొన్ని సెకన్ల దృశ్యాల ఆధారంగా ఖచ్చితమైన నిర్ణయాలకు రావడం సరైంది కాదని చెబుతున్నారు.

అధికారిక స్పంద‌న కోసం వెయిటింగ్..

సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై చర్చ కొనసాగుతోంది. వ్యక్తిగత పరిమితులు, పబ్లిక్ ఈవెంట్లలో ప్రవర్తనా విధానం వంటి అంశాలపై కూడా నెటిజన్లు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, వైరల్ వీడియోల ఆధారంగా వ్యక్తుల భావోద్వేగాలు లేదా ఉద్దేశాలపై ఖచ్చితమైన నిర్ధారణకు రావడం కష్టం. ఈ అంశంపై సంబంధిత నటీనటుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. మరోవైపు, ర‌ష్మిక మంధాన కెరీర్ పరంగా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండగా, ‘కాక్‌టెయిల్-2’ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.