విధాత:రాబోయే సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తారీకులలో టొరంటో, కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో జరుగుతున్న “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిని జరుగుతున్నాయి అని తెలియపరచడానికి ఆనందంగా ఉంది.• మా ఆహ్వానాన్ని మన్నించి సుమారు 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు ఎంతో ఉత్సాహంగా స్పందించి తమ ప్రసంగ ప్రతిపాదనలని మాకు పంపించడం ఎంతో సంతోషాన్ని కలగజేస్తోంది. […]
విధాత:రాబోయే సెప్టెంబర్ 25-26, 2021 (శనివారం, ఆదివారం) తారీకులలో టొరంటో, కెనడా ప్రధాన కేంద్రంగా అంతర్జాలంలో జరుగుతున్న “మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు & 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు” ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిని జరుగుతున్నాయి అని తెలియపరచడానికి ఆనందంగా ఉంది.
• మా ఆహ్వానాన్ని మన్నించి సుమారు 100 మంది అమెరికా-కెనడా సాహితీవేత్తలు ఎంతో ఉత్సాహంగా స్పందించి తమ ప్రసంగ ప్రతిపాదనలని మాకు పంపించడం ఎంతో సంతోషాన్ని కలగజేస్తోంది. ఆయా వక్తలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ అవకాశం కలిగించడానికి సదస్సు జరిగే సమయాలని రెండు రోజులూ ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 7:00 గంటల దాకా (EST, Toronto Time) పొడిగించాం…..అంటే మొత్తం 20 గంటలకి పైగా..
• టొరాంటో (కెనడా) ప్రధాన కేంద్రంగా జరిగే ఈ రెండు రోజుల ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరూ వీక్షించే లా అంతర్జాలంలో జరుగుతుంది.
• ప్రపంచంలో అతి పెద్ద దేశాలయిన కెనడా, అమెరికా సంయక్త రాష్ట్రాలలోని సాహితీవేత్తలు, తెలుగు భాషాభిమానులు కలిసి ఇంత పెద్ద ఎత్తున తమదే అయిన ఒక సాహిత్య వేదిక మీద కలుసుకోవడం మాకు తెలిసీ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ సదస్సుని ఆసాంతం వీక్షించి, ఆనందించమని మీకు మా విన్నపం. సమగ్ర కార్యక్రమం, ప్రసంగాల వివరాలు త్వరలో ప్రకటిస్తాం.
రెండు రోజుల సదస్సు ప్రత్యక్ష ప్రసారం చూసే లింక్ లు (EST, Toronto Time 9:00 AM-7:00 PM….ప్రతీ రోజూ)
• September 25, 2021 YouTube: https://bit.ly/3zcq0O1
• September 26, 2021 YouTube: https://bit.ly/3mjgLYS
ప్రతిష్టాత్మకమైన ఈ ఉత్తర అమెరికా తెలుగు సాహితీ సదస్సు తాజా సమాచారం ఇక్కడ జతపరిచిన 3వ ప్రకటన లో ఛూడండి. అంతే కాదు. త్రివిక్రమ్ సింగరాజు రచన, శశి వర్ధన్ పట్లోళ్ళ దర్శకత్వం లో కెనడా యువతులు హర్ష దీపిక రాయవరపు, భావన పగిడేల ఈ సదస్సు గురించి అందించిన వివరాలు ఈ క్రింది వీడియో లింక్ లలొ చూడండి. https://youtu.be/U4tX3dNHlKwసదస్సుకు సంబంధించిన ఏ విషయానికైనా ఈ క్రింది వారిని సంప్రదించండి.
• సంచాలకులు : లక్ష్మీ రాయవరపు (టొరంటో, కెనడా): sadassulu@gmail.com
• వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సస్, USA): vangurifoundation@gmail.com
• సంధాన కర్తలు: విక్రమ్ సింగరాజు (కెనడా): triv.sing@gmail.com; శాయి రాచకొండ (USA): sairacha@gmail.com
• కార్యనిర్వాహక సంఘం సభ్యులు: యామిని పాపుదేశి, భావన పగిడేల, సర్దార్ ఖాన్, కృష్ణ కుంకాల
• నిర్వహిస్తున్న సంస్థలు: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్, అంటారియో తెలుగు ఫౌండేషన్, టొరాంటో తెలుగు టైమ్స్, కాల్గరి తెలంగాణా అసోసియేషన్, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టోరాంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం