జీమెయిల్‌ అకౌంట్‌ ఉందా..? ఈ ఒక్క పని చేయకుంటే ఈ అకౌంట్‌ డిలీట్‌ అవుతుంది జాగ్రత్త..!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌ జీమెయిల్‌ అకౌంట్‌ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌ యూజర్లు వినియోగిస్తున్న మెయిలింగ్‌ సర్వీసుల్లో జీమెయిల్‌లో మొదటిస్థానంలో ఉన్నది

జీమెయిల్‌ అకౌంట్‌ ఉందా..? ఈ ఒక్క పని చేయకుంటే ఈ అకౌంట్‌ డిలీట్‌ అవుతుంది జాగ్రత్త..!

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా గూగుల్‌ జీమెయిల్‌ అకౌంట్‌ను వినియోగిస్తున్నారు. ఇంటర్నెట్‌ యూజర్లు వినియోగిస్తున్న మెయిలింగ్‌ సర్వీసుల్లో జీమెయిల్‌లో మొదటిస్థానంలో ఉన్నది. అయితే, గూగుల్‌ జీమెయిల్స్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నది. రెండేళ్లకాలంలో ఒక్కసారి కూడా వాడకుండా వదిలేసిన జీ మెయిల్‌ అకౌంట్లను డిలీట్‌ చేయనున్నట్లు ప్రకటించింది. అకౌంట్‌కు సంబంధించిన యూట్యూబ్, జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్ తదితర అన్ని అకౌంట్స్‌ను డిలీట్ చేయనున్నట్లు స్పష్టం చేసింది.


రెండేళ్లుగా సైన్‌ ఇన్‌ చేయని, ఇన్‌ యాక్టివ్‌ అకౌంట్లను డిలీట్‌ చేయబోతున్నట్లు సంబంధిత మెయిల్‌ యూజర్లకు సందేశాలను పంపుతున్నది. ఏదైనా మీరు వాడుతున్న మెయిల్‌ తప్పనిసరిగా అవసరమైతే మెయిల్‌ను ఓపెన్‌ చేయడం మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారి కూడా ఓపెన్‌ చేయకుండా అలాగే వదిలేస్తే గూగుల్‌ డిలీట్‌ చేయడం ఖాయమని పేర్కొంటున్నారు.


డిసెంబ‌ర్‌ నాటికి..


రెగ్యులర్‌గా వాడని జీమెయిల్ వినియోగదారుల అకౌంట్ల డిసెంబర్‌ నాటికి యాక్సెస్‌ను కోల్పోతారని గూగుల్‌ పేర్కొంటున్నది. రిస్క్‌ను తగ్గించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఈ ఏడాది మేలో ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ రూత్ క్రిచెలీ బ్లాగ్‌లో వెల్లడించారు. గూగుల్ ఉత్పత్తుల విషయంలో తమ విధానాన్ని రెండేళ్లకు పరిమితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి గూగుల్‌ ఖాతాను కనీసం 2 సంవత్సరాలుగా సైన్ ఇన్ చేయకుంటే.. జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్‌తో పాటు గూగుల్‌ ఫోటోల్లోని కంటెంట్‌తో సహా ఖాతాను తొలగించవచ్చని పేర్కొన్నారు.


రెండేళ్లుగా సైన్‌ ఇన్‌ చేయని అకౌంట్లను చేయనుండగా.. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు టెక్‌ దిగ్గజం పేర్కొంది. ఎవరైనా అవసరమున్న వారు ఆయా యూజర్స్‌ ఆయా అకౌంట్స్‌ను యాక్టివ్‌ చేసుకోవచ్చని.. ఈ నిర్ణయంతో గూగుల్ అకౌంట్లకు భద్రత లభిస్తుందని, అకౌంట్లు దుర్వినియోగం కాకుండా ఉంటాయని వెల్లడించింది.


పెరుగనున్న భద్రత


వాస్తవానికి రెండేళ్ల నుంచి వినియోగంలో లేని అకౌంట్లను డిలీట్‌ చేయనున్నట్లు గూగుల్‌ 2020 సంవత్సరంలోనే ప్రకటించింది. వాడుకలో లేని చాలా అకౌంట్లు తమ టు స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేయలేవు. దాంతో ఈ తరహా అకౌంట్స్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని, ఈ అకౌంట్స్ అవాంఛిత కంటెంట్ కలిగి ఉండటమో, స్పామ్ అయ్యే అవకాశం ముందని ఆందోళన వ్యక్తం చేసింది.


అయితే, అకౌంట్లను తొలగిస్తే ఇతర యూజర్లకు ఎలాంటి ప్రమాదం తప్పి.. భద్రత పెరుగుతుంది. ఇక జీమెయిల్స్‌ యూజర్లు తమ అకౌంట్లు డిలీట్‌ కాకుండా ఉండేందుకు వాటిని వినియోగంలోకి తీసుకురావాలి. అంటే లాగిన్ అయి, మెసేజ్ ఓపెన్, సెండ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్‌ డ్రైవ్‌ వాడడంతో పాటు యూట్యూబ్ అకౌంట్‌తో లింక్ చేసి, వీడియో చూస్తే సరిపోతుంది.