ఆమెరికాలో మరో తెలుగు విద్యార్థిని మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు అమ్మాయి మృతి చెందింది

విధాత, హైదరాబాద్ : అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరో తెలుగు అమ్మాయి మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలికి చెందిన జెట్టి హారిక (25) వెటర్నరీలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు్ తీవ్ర విషాదంలో మునిగారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఆమెరికాలో జరిగిన పలు ప్రమాదాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థుల వరుస మరణాలు వారి కుటుంబాల్లో విషాదం మిగిలిస్తున్నాయి.
ALSO READ : US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?