Australia Bans Social Media For Kids | ఆస్ట్రేలియాలో 16ఏండ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్
ఆస్ట్రేలియాలో 16 ఏండ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఆన్‌లైన్ సేఫ్టీ బిల్-2024ను ఆమోదించింది.
న్యూఢిల్లీ : సోషల్ మీడియా వినియోగంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో 16 ఏండ్ల లోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కీలక ప్రకటన చేశారు. ఇందుకోసం ఆన్‌లైన్ సేఫ్టీ ఎమెడ్మెంట్ బిల్-2024 ఈ ఏడాది డిసెంబర్ 10 నుంచి అమల్లోకి రానుందని తెలిపారు. ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, రెడిట్, యూట్యూబ్ తదితర మాధ్యమాలకు ఈ చట్టం వర్తించనుందని వెల్లడించారు. దీంతో సోషల్ మీడియాపై నిషేధం విధించిన తొలి దేశంగా ఆస్ట్రేలియా రికార్డుకెక్కనుంది.
సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధాన్ని విధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం గతేడాది ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ బిల్లుకు ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ ఆమోద ముద్ర వేసింది. ప్రతినిధుల సభలో 102 ఓట్ల బలంతో బిల్లుకు ఆమోదం లభించింది. సెనెట్‌లో ఈ బిల్లుకు అనుకూలంగా 34, వ్యతిరేకంగా 19 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లు ప్రకారం 16 ఏండ్ల లోపు పిల్లల సామాజిక మాధ్యమ ఖాతాలను నిరోధించడంలో వ్యవస్థాగతంగా విఫలమైతే సామాజిక మాధ్యమాలకు 50 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.273 కోట్లకు పైమాటేనని సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram