Kyle McGinn | పార్ల‌మెంట్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. నిండు స‌భ‌లో బీర్ తాగిన ఎంపీ.. వీడియో

Kyle McGinn | ఆయ‌నో ఎంపీ( Kyle McGinn ).. దేశ ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా ఉండాల్సినే ఆ నేత‌.. నిండు స‌భ‌లోనే బీర్( Beer ) తాగేసి అంద‌రికీ షాకిచ్చాడు. త‌న షూ( Shoe )లో బీర్ పోసుకుని తాగేసి.. త‌న వీడ్కోలు( Farewell ) ప్ర‌సంగాన్ని ముగిస్తున్న‌ట్లు చెప్పాడు.

Kyle McGinn | పార్ల‌మెంట్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌.. నిండు స‌భ‌లో బీర్ తాగిన ఎంపీ.. వీడియో

Kyle McGinn | పార్లమెంట్( Parliament ) అనేది ప్రజల ప్రతినిధులతో కూడిన శాసనసభ. ఇది చట్టాలను రూపొందిస్తుంది, బడ్జెట్లను ఆమోదిస్తుంది, ప్రభుత్వ విధానాలను సమీక్షిస్తుంది. ఆ దేశ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన‌ ఇతర ముఖ్యమైన పనులు నిర్వహిస్తుంది. కానీ ఆస్ట్రేలియా పార్ల‌మెంట్‌( Australia Parliament ) లో మాత్రం.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా స‌భ లోప‌లే ఓ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌ద‌వీ కాలం ముగిసిన ఓ ఎంపీకి స‌భ‌లో వీడ్కోలు( Farewell ) కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశారు. వీడ్కోలు ప్ర‌సంగం ముగిసిన అనంత‌రం స‌ద‌రు ఎంపీ అంద‌రికీ షాకిచ్చారు. త‌న షూలో బీర్( Beer ) పోసుకుని స‌భ లోప‌లే అంద‌రి ముందు తాగేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

ప‌శ్చిమ ఆస్ట్రేలియా లేబ‌ర్ ఎంపీ కైల్ మెక్ గిన్( Kyle McGinn ). ఇత‌ను టాటూల‌తో ప్ర‌సిద్ధి గాంచాడు. మెక్ గిన్ రెండు సార్లు మైనింగ్, పాస్టోర‌ల్ నుంచి ఆస్ట్రేలియా పార్ల‌మెంట్‌( Australia Parliament )కు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఇక నిండు స‌భ‌లో త‌న ఫేర్ వెల్( Farewell ) ప్ర‌సంగాన్ని ప్రారంభించాడు. తన చివరి ప్రసంగాన్ని “షూయ్” ( Sheoy ) చేస్తూ ముగించాడు. షూయ్.. ఇదొక ప్రసిద్ధ ఆస్ట్రేలియన్ వేడుక. షూ లో బీర్( Beer ) వేసుకుని తాగుతారు. అదే వేడుకను నిండు సభలో ఆచరించాడు మెక్ గిన్( Kyle McGinn ).

స‌భ్యులారా, నన్ను ప్రేమించండి లేదా ద్వేషించండి. నాకు ఏది ముఖ్యం అనేది నా ప్రసంగం సభ్యులకు వివరించిందని నేను ఆశిస్తున్నాను. ఈ ప్రసంగాన్ని ఎలా ముగించాలో నేను చాలాసేపు ఆలోచించాను. దానిని చేయడానికి ఒకే ఒక మార్గం ఉంది. చీర్స్” అంటూ బీర్ ను తన షూలోకి పోశాడు. ఆ తర్వాత తాగేశాడు. మెక్ గిన్ చర్యతో సభ్యులు ఒకింత అవాక్కయ్యారు. అసలేం జరిగిందో వారికి కాసేపు అర్థం కాలేదు. మెక్ గిన్ చర్యతో వారు విస్తుపోయారు. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రజలు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపాడు మెక్ గిన్. గోల్డ్‌ఫీల్డ్స్‌లో ఉన్న వారు తన వీడ్కోలును అభినందిస్తారని వ్యాఖ్యానించాడు.

అధ్యక్షురాలు అలాన్నా క్లోహేసీ వెంటనే లేచారు. ముందు మీ సీటులో కూర్చోండి అని మెక్ గిన్‌తో చెప్పారు. కాగా, కొందరు సభ్యులు నవ్వుతూ చప్పట్లు కొట్టడం విశేషం. గౌరవనీయ సభ్యుడు కౌన్సిల్ గౌరవాన్ని కించపరచడంలో చాలా సున్నితమైన మార్గాన్ని అనుసరించాడని ఆయనకు బాగా తెలుసు. ఆయన ప్రసంగం ఇప్పుడు ముగిసిందని నేను భావిస్తున్నాను” అని క్లోహేసీ అన్నారు.

ఒకప్పుడు ఆయిల్ రిగ్‌లో వంటవాడిగా పనిచేసిన కైల్ మెక్‌గిన్, తన ఇద్దరు సహోద్యోగులు ఉద్యోగంలో మరణించిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. అతను 2017లో పశ్చిమ ఆస్ట్రేలియా శాసన మండలిలోకి ప్రవేశించాడు. 12వ తరగతి ఫెయిల్, టాటూలు వేయించుకున్న తన లాంటి వ్యక్తి రాజకీయ నాయకుడు అవుతాడని నేను ఎప్పుడూ అనుకోలేదు.. కానీ పార్లమెంట్ అందరిదీ అని నమ్మాల్సి వచ్చింది అని మెక్ గిన్ అన్నాడు.