బీర్ల వల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలెన్నో..! ఎండాకాలంలో తాగొచ్చా..?

మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానీక‌రం. ఈ కొటేష‌న్‌ను చాలా సార్లు విని ఉంటాం.. చ‌దివి ఉంటాం. అయితే మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మస్య‌లు త‌లెత్తుతాయ‌ని అంద‌రూ భావిస్తుంటారు.

బీర్ల వల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలెన్నో..! ఎండాకాలంలో తాగొచ్చా..?

మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానీక‌రం. ఈ కొటేష‌న్‌ను చాలా సార్లు విని ఉంటాం.. చ‌దివి ఉంటాం. అయితే మ‌ద్యం తాగ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మస్య‌లు త‌లెత్తుతాయ‌ని అంద‌రూ భావిస్తుంటారు. ఇది కొంత వ‌ర‌కు నిజ‌మే. కానీ మితంగా తాగితే చాలా వ‌ర‌కు అనారోగ్యాల‌కు దూరంగా ఉండొచ్చు. అయితే బీర్లు సేవించ‌డం వ‌ల్ల పెద్ద ప్ర‌మాద‌మేమి లేద‌ని, చాలా వ‌ర‌కు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో బీర్లు తాగితే మంచిదేన‌ని చెబుతున్నారు. కానీ మితంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

బీర్ల‌ను తృణ ధాన్యాలు, పండ్ల ర‌సాల‌తో క‌లిపి త‌యారుచేస్తారు. దీంట్లో ఆల్క‌హాల్ ప‌ర్సంటేజ్ కేవ‌లం 4 నుంచి 6 శాతం ఉంటుంది. బీర్ల‌ను సేవించ‌డం వ‌ల్ల ఖ‌నిజాలు, విట‌మిన్ల‌ను కూడా పొందొచ్చు. ఎప్పుడైతే త‌క్కువ మోతాదులో బీర్లు తాగుతామో అప్పుడు ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలెంటో తెలుసుకుందాం..

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది..

బీర్ తాగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీర్ తాగ‌ని వారితో పోలిస్తే బీర్ సేవించే వారికి గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం 42 శాతం త‌క్కువ‌గా ఉన్న‌ట్లు ప‌లు అధ్య‌య‌నాల్లో తేలింది. అయితే దీన్ని మితంగా తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. రోజుకు 5 శాతం ఆల్కహాల్ తీసుకోవడం వ‌ల్ల పెద్ద న‌ష్ట‌మేమి జ‌ర‌గ‌ద‌ని చెబుతున్నారు.

షుగ‌ర్‌ని నియంత్రిస్తుంది..

ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రిని డ‌యాబెటిస్ వెంటాడుతోంది. బీర్ అనే పానీయం ర‌క్తంలో చ‌క్కెర‌ను మెరుగుపరుస్తుంది. డ‌యాబెటిస్‌కు కార‌ణ‌మైన ఇన్సులిన్ నిరోధ‌క‌త‌ను కూడా త‌గ్గిస్తుంది బీర్. అయితే షుగ‌ర్‌తో కూడిన ఆల్క‌హాల్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల పెద్ద ప్ర‌యోజ‌నం ఉండ‌దు. కాబ‌ట్టి బీర్‌ను మితంగా తీసుకుంటే షుగ‌ర్ పేషెంట్ల‌కు న‌ష్ట‌మేమి ఉండ‌దు.

జీవిత కాలాన్ని పెంచుతుంది..

బీర్ జీవిత కాలాన్నికూడా పెంచుతుంది. బీర్ తీసుకోని వారితో పోలిస్తే.. మితంగా బీర్ తీసుకునే వ్య‌క్తులు చనిపోయే అవ‌కాశం 19 శాతం త‌క్కువ‌గా ఉంద‌ని అధ్య‌య‌నాలు తేల్చాయి.

కిడ్నీలో రాళ్ల‌ను లేకుండా చేస్తోంది..

బీర్ల‌ను మితంగా తీసుకునే వారి మూత్ర నాళ వ్య‌వ‌స్థ‌లో కాల్షియం నిల్వ‌లను నిరోధించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కిడ్నీలో ఉండే రాళ్ల‌ను కూడా బీర్లు బ‌య‌ట‌కు పంపించేస్తాయి. అయితే త‌గిన మోతాదులో బీర్ తీసుకుంటేనే ఈ ఫ‌లితం ఉంటుంది. అధిక మోతాదులో బీర్లు సేవించ‌డం వ‌ల్ల మూత్ర‌పిండాల‌కు న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది.