Hair in Throat | చైన్ స్మోకర్ గొంతులో పెరిగిన వెంట్రుకలు.. 15 ఏండ్లు నరకయాతన.. అతని కథ వింటే షాక్ అవ్వాల్సిందే..!
Hair in Throat | సిగరెట్ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే చాలా మంది మితంగా సిగరెట్లను కాల్చుతుంటారు. కొందరైతే రోజుకో డబ్బా సిగరెట్లను కాల్చుతుంటారు. అలా రోజుకో డబ్బా సిగరెట్లు తాగిన ఓ వ్యక్తికి వింత పరిస్థితి ఎదురైంది. ఎవరూ ఊహించని విధంగా అతని గొంతులో వెంట్రుకలు పెరిగాయి. దీంతో 15 ఏండ్ల పాటు నరకయాతన అనుభవించాడు. చివరకు సర్జరీ చేయించుకొని ఆ బాధ నుంచి విముక్తి పొందాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రియాకు చెందిన ఓ చైన్ స్మోకర్ ప్రస్తుత వయసు 52 ఏండ్లు. తనకు 20 ఏండ్ల వయసున్నప్పటి నుంచి సిగరెట్లు కాల్చడం ప్రారంభించాడు. అంటే 1990 నుంచి 2007 వరకు రోజుకో సిగరెట్ డబ్బాను కాల్చేవాడు ఆ వ్యక్తి. ఈ క్రమంలో అతనికి వింత పరిస్థితి ఎదురైంది. గొంతు బొంగురుపోవడం, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తడం, నిరంతరం దగ్గు రావడం ప్రారంభమైంది. దీంతో వైద్యులను సంప్రదించాడు. పరీక్షలు నిర్వహించగా, అతని గొంతులో వెంట్రుకలు పెరుగుతున్నట్లు నిర్ధారణ అయింది. గొంతులో పెరుగుతున్న వెంట్రుకలను శాశ్వతంగా తొలగిస్తామని, అందుకు స్మోకింగ్ మానేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అతడు ఒప్పుకోలేదు. కొన్నేండ్లుగా వాటిని తాత్కాలికంగా తీయించుకుంటూ నరకం అనుభవించాడు.
15 ఏండ్ల పాటు నరకయాతన..
15 ఏండ్ల పాటు నరకయాతన అనుభవించిన ఆ వ్యక్తి చివరకు వెంట్రుకలను పూర్తిస్థాయిలో తొలగించుకునేందుకు సిద్ధపడ్డాడు. తనకు సర్జరీ నిర్వహించాలని వైద్యులను కోరాడు. 2022లో సర్జరీ చేయించుకున్నాడు. గొంతులో వెంట్రుకల పెరుగుదలకు కారణమవుతున్న కణాలను కాల్చి వేశారు. అయితే గొంతులో ఇలా కావడానికి కారణం ధూమపానం ఎక్కువగా కాల్చడమేనని వైద్యులు తేల్చారు. అతనికి పుట్టుకతోనే గొంతులో 2 ఇంచుల సైజులో 9 వెంట్రుకలు వుండేవి. సిగరెట్ తాగడం వల్ల ఆ వెంట్రుకలు మరింత పెరిగాయని తేల్చారు డాక్టర్లు. అయితే తనకు 10 ఏండ్ల వయసున్నప్పుడు నీళ్లల్లో మునిగిపోవడంతో.. గొంతు కింది భాగంలో గాయమైంది. దీంతో అక్కడ సర్జరీ నిర్వహించారు. ఆ సర్జరీ చేసిన భాగం నుంచే వెంట్రుకలు పెరిగాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram