Plane Crash | దక్షిణ అమెరికా దేశమైన కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. సైనికులను తరలిస్తున్న కొలంబియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. దేశ దక్షిణ భాగంలో పెరూ సరిహద్దుకు సమీపంలోని ప్యూర్టో లెగుయిజామో పట్టణంలో జరిగింది.
సైనిక అధికారుల సమాచారం ప్రకారం.. సైనికులను తరలించేందుకు ఉపయోగించే హెర్క్యులిస్ (Hercules) విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 100 మందికిపైగా సైనికులు విమానంలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. ఈ ఘటనపై కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
సైనిక విమానం కుప్పకూలిన ఘటనపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరకూడదని ఆకాంక్షించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలను ఘటనాస్థలికి తరలించారు. కాగా విమానం కుప్పకూలిన ప్రాంతంలో భారీగా మంటలు, ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Atención: Un avión Hércules de la @FuerzaAereaCol se accidentó saliendo de La Tagua, Putumayo. 110 soldados iban a bordo. Ya han sido rescatados 20 militares heridos. Situación en desarrollo. Vía @BluRadioCo pic.twitter.com/Jgb4tw74aP
— Ricardo Ospina (@ricarospina) March 23, 2026
Read More:
ఈ సమ్మర్‌లో ఫ్రీగా ఫిన్లాండ్ వెళ్లాలని ఉందా.. ఈ గోల్డెన్ ఛాన్స్ కోసం ఇలా అప్లై చేసుకోండి!
9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ.. గేమింగ్ యూజర్లే టార్గెట్‌గా కొత్త 5జీ ఫోన్!
