కాల్పుల సమయంలో అదే హోటల్ లోనే ఉన్నా: కే.ఏ పాల్
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో తాను కూడా అదే హోటల్ లోనే ఉన్నట్లుగా ప్రజాశాంతి అధ్యక్షుడు కే.ఏ.పాల్ వెల్లడించారు. కాల్పుల ఘటన జరిగిన వాషింగ్టన్ హిల్టన్ హోటల్ నుంచి పాల్ ఓ వీడియో విడుదల చేశారు.
విధాత: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లక్ష్యంగా దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో తాను కూడా అదే హోటల్ లోనే ఉన్నట్లుగా ప్రజాశాంతి అధ్యక్షుడు కే.ఏ.పాల్ వెల్లడించారు. కాల్పుల ఘటన జరిగిన వాషింగ్టన్ హిల్టన్ హోటల్ నుంచి పాల్ ఓ వీడియో విడుదల చేశారు. యుద్దాలు, మనుషుల్లో స్వార్ధం, నేరాలు, రాజకీయాలు ఎక్కువైపోయాయని..ప్రపంచంలో అశాంతియుత వాతావరణం పెరిగిపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. అదృష్టవశాత్తు ట్రంప్ సహా ఎవరికి ఏ హాని జరుగలేదన్నారు. ఈ కాల్పుల ఘటన భద్రతా వైఫల్యాన్ని చాటుతుందన్నారు.
అయితే కాల్పుల సమయంలో మాత్రం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తతో వ్యవహరించి అందరిని రక్షించడంలో సఫలీకృతమయ్యారని, దుండగుడిని పట్టుకున్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా ప్రతి ఒక్కరు ప్రపంచంలో శాంతి కోసం, యుద్దాలు ఆగిపోవడం కోసం, మనుషుల్లో మంచితనం కోసం భగవంతుడిని ప్రార్థించాలని పాల్ సూచించారు.
Dr K A Paul from Washington DC Hotel Hilton where a shooter tried to shoot Pres Trump today pic.twitter.com/ECpGarGe1w
— Dr KA Paul (@KAPaulOfficial) April 26, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram