కరీంనగర్ లో తుపాకీ కాల్పుల కలకలం

కరీంనగర్ పట్టణం జ్యోతినగర్ లోని పీఎంజే(PMJ) జ్యువెలరీ షాపులో ఐదుగురు దొంగలు తుపాకీలతో చొరబడ్డారు. అందులోని ముగ్గురు సిబ్బందిపై కాల్పులు జరిపి..భారీగా నగలు ఎత్తుకెళ్లారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | May 03, 2026, 12:41 pm IST
Read Time: 2 mins
కరీంనగర్ లో తుపాకీ కాల్పుల కలకలం

విధాత : కరీంనగర్ పట్టణం జ్యోతినగర్‌ వాసులు తుపాకీ కాల్పుల మోతతో ఉలిక్కి పడ్డారు. ఆదివారం ఉదయం జ్యోతినగర్‌లోని పీఎంజే(PMJ) జ్యువెలరీ షాపులో ఐదుగురు దొంగలు తుపాకీలతో చొరబడ్డారు. అందులోని ముగ్గురు సిబ్బందిపై కాల్పులు జరిపి..భారీగా నగలు ఎత్తుకెళ్లారు.

దొంగలను సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో సిబ్బంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన నలుగురి సిబ్బంది పరిస్థితి విషమంగా ఉంది. దొండలు రెండు బైక్ లపై వచ్చివెళ్లారు. ఘటన స్థంలో రెండు తుపాకీ మ్యాక్ జైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల కోసం నాలుగు బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు.