డొనాల్డ్‌ ట్రంప్‌కు తొలి విజయం.. బైడెన్‌కు పోటీగా మాజీ అధ్యక్షుడు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బరిలోకి దిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ బరిలోకి దిగారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగిన తొలి రేసులో

డొనాల్డ్‌ ట్రంప్‌కు తొలి విజయం.. బైడెన్‌కు పోటీగా మాజీ అధ్యక్షుడు..!

Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం బరిలోకి దిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ బరిలోకి దిగారు. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిత్వానికి జరిగిన తొలి రేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ నెల 15న రిపబ్లికన్ పార్టీ మొదటి కాకస్ అయోవా రాష్ట్రంలో నిర్వహించారు. ఈ కాకస్‌లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. ఈ విజయంతో జో బిడెన్‌కు మరోసారి ట్రంప్‌ పోటీ ఇవ్వనున్నారని స్పష్టమవుతున్నది. అయోవాలో 1600 కంటే ఎక్కువ స్థానాల్లో ఓటింగ్ జరిగింది. ఇందులో డొనాల్డ్ ట్రంప్ విజేతగా ప్రకటించారు. అయితే, డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత సమీప ప్రత్యర్థి ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ రెండో స్థానంలో ఉంటారని అంచనా. అయోవా తర్వాత, న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాలో కూడా కాకస్‌లు జరుగనున్నాయి. ఏది ఏమైనప్పటికీ మొదటి కాకస్ అయిన అయోవాపైనే అందరి దృష్టి నెలకొన్నది. ఇక్కడ విజయం విజయం సాధించిన వ్యక్తులు రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి ఉత్సాహం అందించినట్లవుతుంది. అయితే, ఈ విజయంతో రిపబ్లికన్ పార్టీ ఓటర్లు ఇప్పటికీ ట్రంప్‌కు గట్టి మద్దతు ఇస్తున్నట్లుగా స్పష్టమవుతుంది.

అయోవా కాకస్ అంటే ఏంటీ?

అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు. ప్రెసిడెంట్‌ ఎన్నికలకు ముందు ప్రతి రాష్ట్రంలో పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు రెండు పార్టీలు అంతర్గతంగా ఓటింగ్ నిర్వహిస్తాయి. దీన్నే కాకస్‌గా పిలుస్తుంటారు. అన్ని రాష్ట్రాల్లో ఓటు వేసిన తర్వాత, ఓటింగ్‌లో గెలిచిన అభ్యర్థిని రెండు పార్టీల జాతీయ సమావేశంలో పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటిస్తారు. రిపబ్లికన్ పార్టీకి సంబంధించి మొదటి సభ అయోవా రాష్ట్రంలో జరిగింది. ఈ కాకస్‌లో రిపబ్లికన్ పార్టీకి చెందిన 1,600 మందికి పైగా మద్దతుదారులు రహస్య బ్యాలెట్‌లో ఓటు వేసి.. అభ్యర్థిని ఎంపిక చేశారు. దీన్ని అయోవా కోరల్‌ అని పిలుస్తుంటారు. ఇందులో డొనాల్డ్ ట్రంప్ గెలిచారు. నిక్కీ హేలీ, రాన్ డిసాంటిస్, వివేక్ రామస్వామి సైతం పోటీపడ్డారు. ఇక మిగతా రాష్ట్రాల్లోనూ ఓటింగ్‌ జరుగుతుంది. జూలైలో జరిగే రిపబ్లికన్ పార్టీ సమావేశంలో అధ్యక్ష అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తారు.