Ailao Mountains : అగ్ని పర్వతాల మంటలు కాదు..సూర్య కాంతి అద్బుతాలు !

అగ్నిపర్వతాల మంటలలా కనిపించే ఈ దృశ్యాలు సూర్యకాంతి భ్రమే. చైనా ఐలావో పర్వతాల్లో కనిపించిన ‘అల్పెంగ్లో’ వింత వీడియో వైరల్‌గా మారింది.

Ailao Mountains : అగ్ని పర్వతాల మంటలు కాదు..సూర్య కాంతి అద్బుతాలు !

విధాత: ఆ పర్వత శిఖరాలపై ఎగిసిపడుతున్న అగ్ని కీలలు అగ్ని పర్వతాలు పేలితే ఎగిసిపడుతున్న మంటలు కాదు..కాని చూసే వారికి మాత్రం అలాగే కనిపిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుందో చూస్తే ప్రకృతి చేసే వింతలు..అద్బుతాలు వామ్మో అనిపించకమానవు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చైనాలోని “ఐలావో పర్వత” శిఖరాలు ప్రతి ఉదయం అగ్ని పర్వాతాల మాదిరిగా అగ్నికీలలు కక్కుతున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకు అలా కనిపిస్తుందన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశం వెల్లడైంది. ప్రతి ఉదయం ఐలావో పర్వతంపై సూర్యకాంతి సరైన కోణంలో పడుతుంటుంది. అదే సమయంలో ఆకాశంలో కదిలే మేఘాలు ఆ ఉషోదయపు సూర్యకాంతి ఎర్రని వెలుగుల కాంతులతో అగ్ని జ్వాలలు కదిలినట్లుగా భ్రమింప చేస్తుంటాయి. ఈ అద్బుత వింత దృశ్యాలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి ప్రదర్శిస్తుంటారు.

ప్రకృతిలో జరిగే ఈ అద్భుతాన్ని “అల్పెంగ్లో” అంటారని శాస్త్రవేత్తల కథనం. ఇది ఒక సహజ కాంతి భ్రమ (నేచురల్ ఆప్టికల్ ఇల్యూషన్)గా పేర్కొంటున్నారు. సాధారణంగా సూర్యోదయానికి కొద్దిసేపు ముందు లేదా సూర్యాస్తమయం అయిన వెంటనే ఇలాంటి అద్బుత దృశ్యాలు తరచూ కనువిందు చేస్తుంటాయని చెబుతున్నారు. భారతదేశంలో కూడా హిమాలయాల్లోని కాంచన గంగా, నీలకంఠ్, చౌఖంబా వంటి పర్వతాలపై “అల్పెంగ్లో” దృశ్యం చూడవచ్చు అని గుర్తు చేస్తున్నారు. కాంచన గంగ కొండ శిఖరాలు ఉదయం, సాయంత్రం వేళ సోకే సూర్య కిరణాలలో బంగారు కొండలను, అరుణ వర్ణాలతో కూడిన అగ్ని జ్వాలలను తలపిస్తుంటుందని పేర్కొన్నారు.