Baobab tree| ఈ చెట్టు గర్భం దాల్చిందా..వైరల్ గా సీసా చెట్టు!

బాబాబ్ వృక్ష జాతిరకంకు చెందిన సిబా స్పెసియోసా జాతికి చెందిన చోరిసియా స్పెసియోసా రకం చెట్టు సీసా మాదిరిగా పెరుగుతుంది. దీని మొదలు నుంచి కొమ్మలు వచ్చే వరకు సీసాలా పెరుగుతుంది. దీనిని చూసిన నెటిజన్లు ఇది గర్భంతో ఉన్న చెట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.

Baobab tree| ఈ చెట్టు గర్భం దాల్చిందా..వైరల్ గా సీసా చెట్టు!

విధాత: బాబాబ్(బావో బాబ్) చెట్లు(Baobab tree) అతిభారీ వృక్ష జాతికి చెందినవని తెలిసిందే. అయితే ప్రపంచంలో అతిపెద్ద బాబాబ్ వృక్షాలలో ఒకటిగా ఉన్న బాబాబ్ చెట్టు 8 మీటర్ల పొడవు, 10 మీటర్ల కంటే ఎక్కువ చుట్టుకొలతలో పెరిగిపోయి అందరిని అశ్చర్యపరుస్తుంది. బాబాబ్ వృక్ష జాతిరకంకు చెందిన సిబా స్పెసియోసా జాతికి చెందిన చోరిసియా స్పెసియోసా(Chorisia speciosa) రకం చెట్టు సీసా మాదిరిగా పెరుగుతుంది. ఇది దక్షిణ అమెరికా ఉష్ణ మండలాల్లో పెరుగుతాయని..దీని మొదలు నుంచి కొమ్మలు వచ్చే వరకు సీసాలా పెరుగుతుంది. ఇలాంటి రకం వృక్షమే ఈ ఫోటోలో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు ఇది గర్భంతో ఉన్న చెట్టుగా కామెంట్స్ చేస్తున్నారు.

బాబాబ్‌లు అడన్‌సోనియా జాతికి చెందిన వృక్షాలు. ఆఫ్రికన్ ఖండం వాటికి పుట్టిల్లుగా భావిస్తారు. ఆఫ్రికా, అరేబియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. తొమ్మిది రకాల బాబాబ్ వృక్ష జాతులలో ఒక రకం ఆఫ్రికాలో, ఆరు రకాలు మడగాస్కర్‌లలో ఉన్నాయి. మరో రకం ఆస్ట్రేలియాలో ఉన్నాయి. భారతదేశంలో మధ్యప్రదేశ్‌లోని మాండులో ఈ రకం వృక్షాలు కనిపిస్తాయి. తలకిందుల చెట్లుగా వీటికి మరో పేరు కూడా ఉంది.