Golden Toilet Suclpture | ట్రంప్ పై అమెరికన్ల ‘గోల్డెన్ టాయిలెట్’ సెటైర్లు

ట్రంప్ విధానాలపై అమెరికాలో భారీ నిరసనలు. వాషింగ్టన్‌లో ‘గోల్డెన్ టాయిలెట్’తో వినూత్నంగా సెటైర్లు వేస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Mar 31, 2026, 5:29 pm IST
Read Time: 3 mins
Golden Toilet Suclpture | ట్రంప్ పై అమెరికన్ల ‘గోల్డెన్ టాయిలెట్’ సెటైర్లు

విధాత : యుద్దాలు…అధిక సుంకాలు వంటి అనుచిత నిర్ణయాలతో ప్రపంచ దేశాలతో పాటు అమెరికన్లకు కూడా సమస్యలు తెచ్చిపెడుతున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధానల పట్ల నిరసనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. యుద్ధం, ఆర్థిక సంక్షోభం మధ్య వైట్ హౌస్ రెనోవేషన్ ఆదేశాలపై అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాషింగ్టన్‌లో నేషనల్ మాల్ లింకన్ మెమోరియల్ వద్ద 10 అడుగుల మార్బుల్ సింహసనంపై ‘గోల్డెన్ టాయిలెట్’ ఏర్పాటు చేసి దానిప ట్రంప్ కూర్చున్నట్లుగా వినూత్న నిరసన తెలిపారు. ట్రంప్‌కు ‘గోల్డెన్ టాయిలెట్’అంటూ అమెరికన్లు ప్రజల సెటైర్లతో ట్రోల్ చేస్తున్నారు. రాజుకు తగిన సింహాసనం (A Throne Fit for a King’)పేరుతో ఈ గోల్డెన్ టాయిలెట్ ఏర్పాటు చేసి..ట్రంప్‌పై సెటైర్లు, వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 3 వేల చోట్ల భారీ ప్రదర్శనలు కొనసాగడం సంచలనం రేపింది. “నో కింగ్స్” నినాదాలతో 90 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అమెరికాలో చరిత్రలోనే అతిపెద్ద నిరసనలుగా పేర్కొంటున్నారు. ఇప్పుడు . ‘ఏ థ్రోన్ ఫిట్ ఫర్ ఏ కింగ్’ అని పేరు పెరిట నెలకొల్పిన శిల్పం ద్వారా మరోసారి ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి :

AI Data Centers | డాటా సెంటర్లు ‘హీట్‌ ఐలాండ్స్‌’గా మారిపోతున్నాయా? మానవాళికి కొత్త అధ్యయనం హెచ్చరికలు
Iran War | ఇరాన్‌ విద్యుత్తు ప్లాంట్లు, చమురు బావులను పేల్చేస్తాం.. : మరోసారి ట్రంప్‌ వార్నింగ్‌