హెజ్​బుల్లా కాబోయే అధినేత హషీమ్​ సఫియుద్దీన్​ హతం?

హసన్​ నస్రల్లా మృతి తర్వాత హెజ్బుల్లా కాబోయే అధినేతగా చెప్పబడుతున్న హషీమ్​ సఫియుద్దీన్​తో సంబంధాలు తెగిపోయినట్లు లెబనాన్​ రక్షణ సిబ్బంది సిఎన్​ఎన్​ వార్తాసంస్థకు తెలిపారు.

హెజ్​బుల్లా కాబోయే అధినేత హషీమ్​ సఫియుద్దీన్​ హతం?

హెజ్బుల్లా(Hezbullah) ఎగ్జిక్యూటివ్​ కౌన్సిల్​ అధినేత, హషీమ్​ సఫియుద్దీన్ (Hashem Safieddine-60) ఆచూకీ తెలియరావడం లేదని లెబనాన్​ ప్రభుత్వం, హెజ్బుల్లాకు సంబంధించిన వర్గాలు తెలిపాయి. శుక్రవారం నాడు ఇజ్రయెల్​ దక్షిణ లెబనాన్​లోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్య్ంగా చేసుకుని చేసిన దాడుల (Israel attacks on Friday) తర్వాత హషీమ్​తో సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. దాదాపుగా ఆయన ఆ దాడుల్లో మరణించినట్లు(feared dead)గానే భావిస్తున్నారు. అయితే ఈ వార్త ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.

హెజ్బుల్లా అధినేత హసన్​ నస్రల్లా(Hassan Nasrallah) ఇజ్రాయెల్​ దాడుల్లో హతమైన తర్వాత సంస్థ అధినేతగా హషీమ్​ సఫియుద్దీనే వ్యవరిస్తారని లెబనాన్​ వర్గాలను ఉటంకిస్తూ పలు వార్తాసంస్థలు తెలిపాయి. భవిష్యత్​ అధినేత కూడా ఇప్పుడు హతం(?) కావడంతో హెజ్బుల్లాకు మరో భారీ నష్టం వాటినట్లయింది.

ఓ పక్క, ఇరాన్​(Iran) దాడులు చేస్తున్నా, ఇజ్రాయెల్​ లెబనాన్​పై భూతల, గగనతల దాడులను కొనసాగిస్తోంది. హెజ్బుల్లా అంతమే తమ పంతమన్నట్లు నెతన్యాహు(Benjamin Netanyahu) శాశ్వతంగా శత్రవును నాశనం చేయాలని చూస్తున్నారు. ఇజ్రాయెల్​ వ్యూహాలు, దాడులతో హెజ్బుల్లా ఇప్పటికే భారీగా నష్టపోయింది. దాదాపుగా సంస్థ పతనం దిశగా పయనిస్తోందని పశ్చిమాసియా అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడ్డారు.

హషీమ్​ సఫియుద్దీన్ హసన్​ నస్రల్లాకు తల్లి తరపు(Maternal Coursin) సమీప బంధువు. ఇద్దరూ కలిసి ఇరాన్​లో చదువుకున్నారు. నస్రల్లా లాగే హషీమ్​ కూడా ఇజ్రాయెల్​కు బద్ధశత్రువు. ఇరాన్​ అత్యున్నత అధికార వర్గాలతో చాలా సన్నిహిత సంబంధాలు కలిగిఉన్నవాడు. హెజ్బుల్లాలో నస్రల్లా తర్వాత అంతటి శక్తివంతుడు హషీమే. పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల తర్వాత హషీమ్​ మాట్లాడుతూ, చివరి వరకు మేము వెనుదిరిగే ప్రసక్తే లేదని ప్రకటించాడు.