అంతరిక్షంలో హనీమూన్
విధాత:పెళ్లయ్యాక తమ తొలిరాత్రిని భూగోళంపైన కాకుండా.. ఆకాశంలోనో..అంతరిక్షంలోనో జరుపుకోవాలని కలలు కనే వారెందరో..! నాసా మాజీ చీఫ్ జార్జ్ థామస్ వైట్‌సైడ్స్, ఆయన భార్య, యూరీస్ నైట్ సహ వ్యవస్థాపకురాలు లోరెట్టా వైట్‌సైడ్స్ ఈ కోవకు చెందిన వారే. ఇద్దరినీ కలిపింది ‘అంతరిక్షం’ఫై ఆసక్తి, పరిశోధనలే ! అలా 2006లో వివాహ బంధంతో ఒక్కటైన వారిద్దరూ తమ హనీమూన్‌ను అంతరిక్షంలో జరుపుకోవాలని కంకణం కట్టుకున్నారు. దీంతో స్పేస్ హనీమూన్ ప్రయాణ ఖర్చులకు అడ్వాన్సుగా ఉంచండంటూ.. 2007లోనే వర్జిన్ […]

విధాత:పెళ్లయ్యాక తమ తొలిరాత్రిని భూగోళంపైన కాకుండా.. ఆకాశంలోనో..అంతరిక్షంలోనో జరుపుకోవాలని కలలు కనే వారెందరో..! నాసా మాజీ చీఫ్ జార్జ్ థామస్ వైట్‌సైడ్స్, ఆయన భార్య, యూరీస్ నైట్ సహ వ్యవస్థాపకురాలు లోరెట్టా వైట్‌సైడ్స్ ఈ కోవకు చెందిన వారే. ఇద్దరినీ కలిపింది ‘అంతరిక్షం’ఫై ఆసక్తి, పరిశోధనలే ! అలా 2006లో వివాహ బంధంతో ఒక్కటైన వారిద్దరూ తమ హనీమూన్‌ను అంతరిక్షంలో జరుపుకోవాలని కంకణం కట్టుకున్నారు. దీంతో స్పేస్ హనీమూన్ ప్రయాణ ఖర్చులకు అడ్వాన్సుగా ఉంచండంటూ.. 2007లోనే వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్కు రూ.1.50 కోట్లు (2 లక్షల డాలర్లు) చెల్లించారు. 13 ఏళ్ల నిరీక్షణ అనంతరం.. వారి కల సాకారమయ్యే దిశగా ఒక అడుగు ముందుకు పడింది.
ఆదివారం రాత్రి విజయవంతమైన వర్జిన్ గెలాక్టిక్ మిషన్‌లో జార్జ్ థామస్, లోరెట్టా దంపతులు గ్రౌండ్ స్టేషన్ నుంచి కీలక హోదాల్లో సేవలు అందించడం విశేషం. జార్జ్ వైట్‌సైడ్స్ ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్‌కు సీఈవోగా వ్యవహరిస్తుండగా.. లోరెట్టా జీరో-జీ సంస్థ డైరెక్టర్‌గా, యూరీస్ నైట్ సహ వ్యవస్థాపకురాలిగా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. అంతరిక్షంలో హనీమూన్ జరుపుకొన్న తొలి జంటగా ఘనతకెక్కాలని ఈ జంట తహతహలాడుతోంది. ‘టెడెక్స్’ ప్రఖ్యాత స్పీకర్‌గా పేరుగాంచిన లోరెట్టా.. పలు సందర్భాల్లో తమ అంతరిక్ష హనీమూన్ కల గురించి ప్రస్తావించారు. 2014లో వర్జిన్ గెలాక్టిక్ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ప్రమాదం సంభవించడంతో పైలట్ చనిపోయాడు. దాంతో ఓ దశలో తమ కల కల్లేననే ఆందోళన కలిగిందని లోరెట్టా వివరించారు. అయినా తమ కలను ఏనాటికైనా సాకారం చేసుకుంటామనే విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.