వావ్…పక్షుల చెట్టు చూశారా..! ఇంటర్​నెట్​ను మైమరపించిన వీడియో!

అనమలై టైగర్ రిజర్వ్‌లో వేలాది పక్షులు చెట్టు ఆకుల్లా కొమ్మలపై వాలిన అరుదైన దృశ్యం వైరల్‌గా మారింది. ప్రకృతి సౌందర్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

వావ్…పక్షుల చెట్టు చూశారా..! ఇంటర్​నెట్​ను మైమరపించిన వీడియో! చెట్టుపై ఆకుల్లా కనిపిస్తున్న బీ-ఈటర్స్ పక్షుల గుంపు – రకరకాల రంగుల్లో మనోహరంగా ఉన్నాయి

విధాత వైరల్​ డెస్క్​ | హైదరాబాద్​:

ప్రకృతి అందాలు చూడతరమా అనిపించేలా..పర్వతగిరుల్లో కనిపించిన పక్షుల చెట్టు అద్బుతాన్ని ఆవిష్కరించింది. కొండ శిఖరాలపై చెట్టు కొమ్మల ఆకులను తలపించేలా పక్షుల సమూహం కొలువుతీరిన దృశ్యం కనువిందుకాక మానదు. అందులో ఆ పక్షలు కిలకిల రావాలు..మధుర గానాల మాదిరిగా మమైరిపించడం మరింత మానసిక ఆహ్లాదాన్ని అందిస్తుందనడంతో అతిశయోక్తి లేదు.

అనమలై టైగర్ రిజర్వ్ అభయారణ్యంలోని పర్వత గిరుల్లో వేలా వేలాది చెస్ట్‌నట్-హెడెడ్ బీ-ఈటర్ పక్షుల జాతులు సాయంత్రం గూటికి చేరేముందు గుంపులుగా విహరిస్తూ..ఆకాశాన్ని రంగులతో కమ్మెసినట్లుగా కనువిందు చేస్తుంటాయి. ఇదే క్రమంలో ఓ పర్వతగిరిపైన చెట్టుకొమ్మపై వాలిన చెస్ట్‌నట్-హెడెడ్ బీ-ఈటర్ పక్షులు ఆ కొమ్మకు ఆకుల మాదిరిగా ఒదిగిపోయాయి. ఆ సుందర దృశ్యాన్ని అటవీ శాఖ అధికారి సుప్రియ సాహు ఎక్స్ లో పంచుకున్నారు.

రంగురంగుల ఆకులా? కిలకిలారావాల పక్షులా?

Chestnut-headed bee eater bird perched on a branch showing vibrant green, yellow and chestnut colors

ఆకుల్లా కనిపించే గుంపులోని అసలు పక్షి… రంగురంగుల చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్

ఇదే ఆ “ఆకుల్లా కనిపించిన” పక్షి 👇
చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్

🎨 రంగుల మ్యాజిక్

  • 🔴 తలపై గోధుమ-ఎరుపు (Chestnut)

  • 🟡 మెడ దగ్గర పసుపు షేడ్

  • 🟢 శరీరం మొత్తం ఆకుపచ్చ

  • 🔵 తోకలో నీలం టోన్

వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ శ్రీరామ్ పి. మురళి చిత్రీకరించిన ఈ వీడియోలో, ‘చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్స్’ అనే పక్షులు వేల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలో ఎగురుతూ కనిపించాయి. వాటి చిలిపి చిలిపి కిలకిలారావాలు ఒక అద్భుతమైన సంగీత విందులా అనిపించాయి.అన్నామలై అడవుల్లో కనిపించిన ఈ అద్భుత దృశ్యంలో, చెట్టు కొమ్మలపై వరుసగా కూర్చున్న ‘చెస్ట్నట్-హెడెడ్ బీ-ఈటర్స్’ పక్షులు, దూరం నుంచి చూస్తే ఆకుల్లా కనిపిస్తున్నాయి. దగ్గరగా చూస్తే మాత్రం వాటి రంగులు, కదలికలు ఒక అద్భుతమైన “బర్డ్ ఆర్కెస్ట్రా”లా మారిపోతాయి.

సుప్రియా సాహు తన పోస్ట్‌లో “ఇది నిజమైన బర్డ్ ఆర్కెస్ట్రా. ఈ పక్షులు భద్రత కోసం గుంపులుగా కదులుతాయి. పరస్పరం శబ్దాల ద్వారా కనెక్ట్ అవుతూ, కలిసి వేటాడుతాయి. ఇవి కీటకాలను నియంత్రించి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి” అని వివరించారు.

అడవుల అంచుల వెంబడి, పర్వత ప్రాంతాల్లో, మైదానాల్లో కనిపించే ఈ ఉత్సాహభరితమైన పక్షులు, కీటకాల జనాభాను నియంత్రించడం ద్వారా ముఖ్యమైన పర్యావరణ పాత్రను కూడా పోషిస్తాయని, సమూహంగా సంచరిస్తూ.. ఐకమత్యంలోనే బలం ఉందని చాటడంతో పాటు తమ రాగాలతో అద్బుత గానామృతాన్ని పంచుతాయని పేర్కొనడం విశేషం.

ఇవి కూడా చదవండి :

Nellore : కూల్ డ్రింక్స్ లారీ బోల్తా…10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం
Droupadi Murmu Visits Ayodhya : అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము