Baby Monkey Punch | పంచ్ గాడికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!

జపాన్‌కు చెందిన వైరల్ కోతి పిల్ల పంచ్ కున్ (ముద్దుగా పంచ్)కు తోడు దొరికేసింది. పుట్టగానే తల్లి సహా సహచర కోతుల గుంపు దూరం పెట్టడంతో ఒంటరైపోయిన పంచ్ ఒరంగుటాన్ బొమ్మ కోతినే తల్లిగా భావించి దానితోనే బతికేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలొ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పంచ్ గాడికి ఓ గర్లఫ్రెండ్ జతకూడిన వీడియో వైరల్ అవుతోంది. తనకు జత అయిన గర్ల్ ఫ్రెండ్ కోతి పిల్లతో కలిసి పంచ్ ముద్దు ముచ్చట్లలో మునిగి తేలుతుంది.

Baby Monkey Punch |  పంచ్ గాడికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందోచ్..!

విధాత, హైదరాబాద్ : జపాన్‌కు చెందిన వైరల్ కోతి పిల్ల పంచ్ కున్ (ముద్దుగా పంచ్)కు తోడు దొరికేసింది. పుట్టగానే తల్లి వదిలేయడంతో పాటు సహచర కోతుల గుంపు కూడా పంచ్ ను దూరం పెట్టడంతో జూ సిబ్బంది ఇచ్చిన ఒరంగుటాన్ బొమ్మను తల్లిగా భావిస్తూ దానితోనే రోజులు వెళ్లదీస్తున్న పంచ్ కు తన ఈడు ఆడ కోతి పిల్ల ఒకటి తోడైంది.

ప్రస్తుతం పంచ్ ఒరంగుటాన్ బొమ్మ కోతితో కాకుండా..తనకు జత అయిన గర్ల్ ఫ్రెండ్ కోతి పిల్లతో కలిసి ముద్దు ముచ్చట్లలో మునిగి తేలుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకాలం అందరూ ఉన్నా.. ఒంటరిగా బతికేస్తున్న పంచ్ గాడిని దేవుడు కరుణించి ఇన్నాళ్లకు ఓ తోడును అందించాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

పంచ్ కున్ అనే కోతి పిల్ల 2025 జులైలో జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో జన్మించింది. పుట్టిన కొద్దిసేపటికే తల్లి కోతి పంచ్‌ను దూరం పెట్టింది. తల్లితో పాటు గుంపులోని మిగిలిన కోతులు కూడా పంచ్‌ను దగ్గరకు రానివ్వలేదు. దీంతో పంచ్ కోతి పిల్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన జూ సిబ్బంది అది ఎమోషనల్‌గా దెబ్బతినకుండా ఉండటానికి ఒరంగుటాన్ కోతి బొమ్మను అందించారు.

పంచ్ కోతి ఆ బొమ్మనే అమ్మగా భావించింది. ఆ బొమ్మతోటే 24గంటలు గడుపుతూ తను ఎటు వెళితే అటు దానిని వెంట తీసుకెలుతుంది. పంచ్ కోతి పిల్ల బొమ్మ కోతితో తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పంచ్ కోతి పిల్లను తల్లి దూరం పెట్టిన కథ తెలిసి జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. కేవలం పంచ్‌ను చూడ్డానికి జూకు జనం క్యూలు కట్టారు. ఇటు సోషల్ మీడియాలో సైతం పంచ్‌ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఇటీవల తల్లి కోతి దానిని అడపదడపా దగ్గరకు తీసుకుంది.

అన్నింటికి మించి పంచ్ గాడి క్రేజీకి పడిపోయిన ఓ ఆడ కోతి పిల్ల పంచ్ గాడికి దగ్గరైంది. ఇప్పుడు నిరంతరం పంచ్ తనతో జతకూడిన గర్లఫ్రెండ్ కోతిపిల్లతో ముద్దు ముచ్చట్లలో మునిగి తేలుతుంది. ఇది చూిన నెటిజన్లు పంచ్ గాడి జంట ఈడుజోడు బాగుందంటూ సరదగా కామెంట్లు పెడుతున్నారు.