Iran Red Beach : సముద్రం రక్తంతో నిండిందా…!
ఇరాన్‌లోని హోర్మోజ్ ద్వీపంలో సముద్ర కెరటాలు రక్త వర్ణంలో మెరిసిపోయాయి. నేలలోని ఐరన్ ఆక్సైడ్ వర్షపు నీటితో కలిసి సముద్రంలో చేరడంతో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.
విధాత : రక్తంతో సముద్రం నిండిపోయిందా..అంటే అవుననిపిస్తుంది ఈ వీడియోలో దృశ్యాలు. రక్తవర్ణపు జలాలతో సముద్రపు కేరటాలు తీరాన్ని తాకుతుండగా..చూసేందుకు ఓ రకంగా భయం..మరోరకంగా అద్భుతం అనిపించేలా కనిపిస్తుంది.
ఇరాన్‌లోని హోర్మోజ్ ద్వీపంలోని ‘సాహెల్ సోర్ఖ్’ (ఎర్రటి బీచ్) వద్ద కురిసిన భారీ వర్షాల కారణంగా రక్తవర్ణపు సముద్ర కెరటాల అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు నీరు బీచ్‌లోని ఎర్రటి మట్టిని (ఐరన్ ఆక్సైడ్) సముద్రంలోకి తీసుకురావడంతో తీరం వెంబడి రక్తం రంగులో ఉండే కెరటాలు ఎగిసిపడ్డాయి. పర్యాటకులను అబ్బురపరిచిన ఈ అరుదైన ‘బ్లడ్ రెయిన్’ లాంటి దృశ్యం నేలలోని హేమటైట్ ఖనిజం వల్ల ఏర్పడింది.
ప్రకృతి ఎరుపు రంగుతో గీసిన అద్భుత కాన్వాయ్ చిత్రంగా కనిపిస్తున్న ఎర్రటి సముద్ర కెరటాల దృశ్యాల వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాలోని డైలాగ్ ..తీరంలోని కేరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి అన్నట్లుగా వీడియోలోని ఎర్రటి సముద్ర కెరటాలు కనిపిస్తున్నాయని కామెంట్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Akhanda 3 | ‘అఖండ 3’పై బోయపాటి శ్రీను క్లారిటీ .. అవెంజర్స్ స్థాయి స్కోప్ ఉందంటూ కీలక వ్యాఖ్యలు
Messi Shares India Tour Video : మెస్సీ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి మిస్ !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram