గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్‌గా 194 ఏళ్ల వృద్ధ తాబేలు ‘జోనాథన్’

భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతన జంతువుగా రికార్డు సృష్టించిన 194ఏళ్ల 'జోనాథన్' తాబేలును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఐకాన్‌గా ప్రకటించడం విశేషం. 1832లో జన్మించినట్లు భావిస్తున్న ఈ తాబేలు, ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతన జంతువుగా రికార్డు సృష్టించింది.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా పేరొందిన ‘జోనాథన్’ అనే తాబేలును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ఐకాన్‌గా ప్రకటించింది. సగటు ఆయుర్ధాయం 150 ఏళ్లు మాత్రమే ఉన్న సెషెల్స్ జెయింట్ జాతికి చెందిన ఈ తాబేలు, ప్రస్తుతం 194వ ఏట అడుగుపెట్టింది. సుమారు 1832లో జన్మించినట్లు భావిస్తున్న ఈ తాబేలు, ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతన జంతువుగా రికార్డు సృష్టించింది. ఈ సందర్బంగా ‘జోనాథన్’ తాబేలును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఐకాన్‌గా ప్రకటించడం విశేషం.

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ భూచర జంతువుగా 194 ఏళ్ల సీషెల్స్ జెయింట్ తాబేలు అయిన జొనాథన్‌ ప్లాంటేషన్ హౌస్‌లో నివసిస్తుంది. అంధత్వం, క్షిణించిన ఇంద్రియాల శక్తి సమస్యలు ఉన్నప్పటికి మేత మేస్తూ, ఇతర జీవరాశులతో మమేకమవుతూ దాదాపు రెండు శతాబ్దాల అరుదైన చరిత్ర ప్రస్థానం వైపు సాగిపోతుంది.

 

Latest News