Sudan Landslide : అఫ్రికా దేశం సూడాన్ లో ప్రకృతి విలయం..1000మందికి పైగా మృతి
సూడాన్‌లో డార్ఫర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 1000 మందికి పైగా మృతి. టరాసిన్ గ్రామం పూర్తిగా భూస్థాపితమైందని అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ : అఫ్ఘానిస్తాన్(Afghanistan) దేశంలో నెలకొన్న భూకంపం సృష్టించిన ప్రాణ, ఆస్తి నష్టం మరువకముందే ఆఫ్రికా(Africa) దేశం సూడాన్‌లో(Sudan) ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. మర్రా పర్వతాల(Marra Mountains) ప్రాంతంలో డార్ఫర్(Darfur) ప్రాంతంలోని టరాసిన్ గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలతో 1000 మందికి పైనే ప్రజలు మృతి చెందారు.
సూడాన్ లిబరేషన్ మూమెంట్(Sudan Liberation Movement)/ఆర్మీ(Army) జరిగిన ప్రాణ నష్టాన్ని ధ్రువీకరించింది. రోజుల తరబడి వర్షం కురవడంతో ఆగస్టు 31న కొండచరియలు విరిగిపడ్డట్లు అక్కడి అధికారులు తెలిపారు. కొండచరియల ధాటికి టరాసిన్ గ్రామం మొత్తం పూర్తిగా భూస్థాపితమైందని… ఈ ప్రమాదంలో ఒక్కరే బతికినట్లు వెల్లడించారు. ప్రకృతి వైపరిత్యం భారిన పడిన తమ దేశ ప్రజలకు సహాయం అందించేందుకు ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి ముందుకు రావాలని సూడాన్ ప్రభుత్వం కోరింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram