Global Hunger Index | 42 దేశాల్లో తీవ్రమైన ఆకలి సమస్య: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 రిపోర్ట్
ప్రపంచంలో 42 దేశాల్లో తీవ్రమైన ఆకలి సమస్య ఉందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియాలో పరిస్థితులు ఆందోళనకరం.

న్యూఢిల్లీ, అక్టోబర్ 15 (విధాత ప్రతినిధి):ప్రపంచంలోని 42 దేశాల్లో తీవ్రమైన ఆకలి సమస్య ఉందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2025 నివేదిక బయటపెట్టింది. 20 ఇయర్స్ ఆఫ్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ టైమ్ టు రీ కమిట్ టూ జీరో హరంగ్ అనే శీర్షికతో ఈ నెల 10న గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ను విడుదలైంది. 2030 నాటికి ఆకలితో ఇబ్బందిపడే పరిస్థితి ఉండొద్దనే దిశగా ఐక్యరాజ్యసమితి ప్రణాళికలు సిద్దం చేసింది.
ఏడు దేశాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు
ప్రపంచంలో ని 42 దేశాల్లో ఆకలి సమస్య తీవ్రంగా ఉంది. అయితే ఇందులో ఏడు దేశాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బురుండి, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, హైతీ, మడగాస్కర్, సోమాలియా, దక్షిణ సూడాన్, యెమెన్ దేశాల్లో ఈ పరిస్థితి ఆందోళనకరస్థాయిలో ఉంది. మిగిలిన 35 దేశాల్లో కూడా ఆకలి సమస్య తీవ్రంగానే ఉందని నివేదిక చెబుతోంది. 2016 నుంచి ప్రపంచంలోని 27 దేశాల్లో ఆకలి తీవ్రత పెరిగింది. ఫిజి, జోర్డాన్, లిబియా, సోలమన్ దీవులు, సిరియా దేశాల్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ మరింత పడిపోయాయి.
ఆఫ్రికా దేశాల్లో తీవ్రంగా ఆకలి సమస్య
సహారాకు దక్షిణంగా ఉన్న ఆఫ్రికా ప్రపంచవ్యాప్తంగా , దక్షిణాసియాలో ఆకలి సమస్య తీవ్రంగానే ఉంది. సహారాకు దక్షిణంగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో ప్రపంచంలోనే అత్యధిక ఆకలిస్థాయిలను నమోదు చేస్తూనే ఉంది. 2016 నుంచి ఈ దేశాల్లో పురోగతి మందగించింది. 10 దేశాల్లో ఆకలి బాగా పెరిగింది. అంతేకాదు పోషకారలోపం కూడా తీవ్రమైన సమస్యగా ముందుకు వచ్చింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, లైబీరియా, మడగాస్కర్, కెన్యా, సోమాలియా, జాంబియాలలో ఈ పరిస్థితి ఆందోళనకరమైన స్థాయిల్లో ఉంది. 2000 సంవత్సరంలో నమోదైన గ్లోబర్ హంగరర్ ఇండెక్స్ కంటే ఈ ఏడాది మరింత అధ్వాన్నంగా స్కోర్లు నమోదయ్యాయి. 2016 నుండి పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికాలోని దేశాలు ఆకలిని తగ్గించడంలో పరిమిత పురోగతిని మాత్రమే సాధించాయి. ఇక పది దేశాల్లో పురోగతి నిలిచిపోయింది. ఈ దేశాల్లో 2016 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ కంటే ఐదు శాతం తక్కువగా స్కోర్లు నమోదయ్యాయి. లేదా ఈ స్కోర్లలో మార్పు రాలేదు.
యుద్ధాలు,సాయుధ పోరాటాలతో సమస్యలు
ప్రపంచంలో ఆకలి సమస్యకు ప్రధాన కారణాన్ని యుద్ధాలు, సాయుధ పోరాటాలు కారణంగా ఈ రిపోర్ట్ చెబుతోంది. వాతావరణ మార్పులతో వస్తున్న పరిణామాలు, వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలనే రాజకీయ సంకల్పం లేకపోవడం కూడా కారణమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. తూర్పు, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో పురోగతిలో వేగం తగ్గింది. ఈ ప్రాంతాల్లో ఆకలి సమస్య ఉంది.యూరప్, మధ్య ఆసియా ప్రాంతాల్లో అత్యల్ప గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ ను నమోదు చేస్తున్నాయి. పోషకాహారలోపం, పిల్లల్లో పెరుగుదల లేకపోవడం, పిల్లల మరణాలు వంటి అంశాల ఆధారంగా ఆయా దేశాలకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్ కేటాయిస్తారు. తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొన్ని దేశాలు స్థిరమైన పసురోగతిని చూపించాయి. మొజాంబిక్, రువాండా, సోమాలియా, టోగో, ఉగాండాలలో పురోగతిని గుర్తించారు. అయితే ఇంకా సవాళ్లు ఉన్నాయి. తజకిస్తాన్ లో పురోగతిలో నిలిచింది.
ప్రతి 11 మందిలో ఒకరు ఆకలితో
ప్రపంచంలో ప్రతి రోజూ ప్రతి 11 మందిలో ఒకరు ఆకలితో అలమటిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలో 8.2 బిలియన్ల ప్రజలకు తగినంత ఆహారం కోసం ఆహారాన్ని ఉత్పత్తి అవుతోంది. అయినా కూడా 2024లో 673 మిలియన్ల ప్రజలు పాక్షికంగా లేదా పూర్తిగా ఆకలితో బాధపడ్డారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఆకలి సమస్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. 55 ఏళ్ల క్రితం ప్రపంచంలో నలుగురిలో ఒకరు ఆకలితో అలమటించేవారు. కరోనా తర్వాత ఆకలి సమస్య పెరిగింది. 2023లో 733 మిలియన్ల మంది ఆకలితో బాధపడ్డారని అంచనా వేశారు. 2021 నాటికి ఈ సంఖ్య 828 మిలియన్లకు చేరింది.
వాతావరణ మార్పులతో ముప్పు
మారుతున్న వాతావరణ సమస్యలు పర్యావరణానికి ముప్పుగా పరిణమించాయి. ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యాయి. దీంతో ఆహార భద్రతకు ఇబ్బంది ఏర్పడింది. గత ఏడాది రికార్డు స్థాయిల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో అట్టడుగున ఉన్న మడగాస్కర్ లో సాధారణ తుఫాన్లు, కరువును ఎదుర్కొంది. దక్షిణ సూడాన్ లో తీవ్రమైన వరదలు దెబ్బతీశాయి. సోమాలియా ఏళ్ల తరబడి కరువును ఎదుర్కొంటుంది.
ప్రకృతి వైపరీత్యాలతో పాటు, యుద్ధాలు కూడా ఆహార భద్రతను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధంతో పలు దేశాలు కూడా ద్రవ్యోల్బణం బారినపడ్డాయి. 2020 ఆర్ధిక మాంద్యం నుంచి కోలుకుంటున్నాయి. ప్రపచం జనాభాలో 35 శాతం ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందలేకపోతున్నారు. తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంది. అంటే 71 శాతం ప్రజలకు సరైన లేదా మంచి ఆహారం అందడం లేదు.