Africa terrorist attack| ఆఫ్రికా ఉగ్రవాదుల చెరలో ఇద్దరు తెలుగు యువకులు
ఉపాధి కోసం అఫ్రికా దేశానికి వెళ్లిన ఇద్దరు తెలుగు యువకులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మాలి దేశంలో పనిచేస్తున్న యాదాద్రి జిల్లాలోని బండసోమారంకు చెందిన నల్ల మాస ప్రవీణ్(26), ఆంధ్రప్రదేశ్ కదిరి సమీపంలోని కొవ్వూరివాండ్లపల్లి (పొడరాళ్లపల్లి) కి చెందిన రామచంద్ర(26) అనే ఇద్దరు తెలుగు కార్మికులను మాలిలో జేఎన్ఐఎ( JNIM) ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు
న్యూఢిల్లీ : ఉపాధి కోసం అఫ్రికా(Africa) దేశానికి వెళ్లిన ఇద్దరు తెలుగు యువకుల(Telugu Youth)ను ఉగ్రవాదులు(terrorist Kidnap) కిడ్నాప్ చేశారు. మాలి(Mali) దేశంలో పనిచేస్తున్న యాదాద్రి జిల్లాలోని బండసోమారంకు చెందిన నల్ల మాస ప్రవీణ్(26), ఆంధ్రప్రదేశ్ కదిరి సమీపంలోని కొవ్వూరివాండ్లపల్లి (పొడరాళ్లపల్లి) కి చెందిన రామచంద్ర(26) అనే ఇద్దరు తెలుగు కార్మికులను మాలిలో జేఎన్ఐఎ( JNIM) ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్ ముస్లిమీన్ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ప్రవీణ్, రామచంద్ర ఏడాది క్రితం దక్షిణాఫ్రికాలోని ఓ బోర్‌వెల్స్ కంపెనీలో పనిచేసేందుకు వెళ్లారు.
గత నెల 22న చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తరువాత రోజు ఆగంతకులు ఆయన్ను కిడ్నాప్ చేశారంటూ సంబంధిత కంపెనీ నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్ కు గురైన తమ వారి నుంచి, కంపెనీ నిర్వాహకుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో తల్లి దండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ వారిని క్షేమంగా ఇంటికి వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో జూలై 1న కూడా ముగ్గురు భారతీయుల కిడ్నాప్ కు గురయ్యారు. వారిలో ఒకరు ఏపీకి చెందిన జమ్మలమడక గ్రామానికి చెందిన అమరలింగేశ్వరరావు కాగా, మరో ఇద్దరు వ్యక్తులు ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram