వెనిజులా దేశాన్ని భారీ భూకంపం వణికించింది. రాజధాని కరాకస్ నగరంతో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాలలో వరుసగా రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై మొదట 7.1, ఆ వెంటనే 39 సెకన్ల వ్యవధిలోనే మరోసారి 7.5 తీవ్రతతో భూమి తీవ్రంగా కంపించింది. దేశ కరేబియన్ తీరంలోని మోరోన్ ప్రాంతానికి పశ్చిమాన సుమారు 28 కిలోమీటర్ల దూరంలో, 13 కిలోమీటర్ల లోతులో తొలి భూకంప కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది.
ఈ భీకర భూకంపాల ధాటికి రాజధాని నగరంలోని బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు కుప్పకూలిపోయాయి. భూకంప తీవ్రతతో ఊగిపోతున్న ఇళ్లు, కూలుతున్న భారీ భవనాల నుంచి బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఈప్రకృతి విపత్తు ధాటికి పలువురికి గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.వెనిజులా లో సెకన్లు..నిమిషం వ్యవధిలో ఒకే ప్రాంతంలో రెండు భూకంపాలు సంభవించడాన్ని ‘ఎర్త్‌క్వేక్ డబ్లెట్’ అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు.
అమెరికా…జపాన్‌లోనూ భూకంపాలు..
వెనెజువెలాను వణికించిన భూకంపం.. తర్వాత అమెరికా, జపాన్ దేశాలను సైతం తాకింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. హొన్షు ఐలాండ్‌లోని ఐవాటె ప్రిఫెక్చర్ సమీపంలో 50కి.మీ.లోతులో భూకంప కేంద్రం ఏర్పడింది. అక్కడి నుంచి వందల కిలోమీటర్ల వరకు ప్రకంపనల తీవ్రత కనిపించిందని జపాన్ వాతావరణ విభాగం వెల్లడించింది. ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఈ దేశంలో ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ కాలేదు. అదే సమయంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో సౌతం 5.6 తీవ్రతతో భూకంపం వాటిల్లింది.
భారత్ పుల్వామాలోనూ భూ ప్రకంపనలు..
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సైతం గురువారం తెల్లవారుజామున 3.5 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. పుల్వామాలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్‌లో 15 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు పేర్కొన్నారు.
