హోర్ముజ్​పై అత్యంత ఖరీదైన అమెరికా డ్రోన్​ గల్లంతు.. కూలిందా? కూల్చేశారా?

హోర్ముజ్ జలసంధి పై అమెరికా నావికాదళానికి చెందిన అత్యాధునిక MQ-4C ట్రైటాన్ డ్రోన్ మాయమైంది. ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చిన కొద్ది సేపటికే రాడార్ నుంచి అదృశ్యమవడంతో కూలిందా లేదా ఇరాన్ కూల్చేసిందా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

MQ-4C Triton US Navy surveillance drone in flight high altitude maritime UAV

అత్యాధునిక MQ-4C ట్రైటాన్ డ్రోన్ — గంటల తరబడి గగనతలంలో గూఢచర్యం చేసే శక్తి

$200 Million US Drone Vanishes Over Hormuz: Crash or Shot Down? Mystery Deepens

  • $200 మిలియన్ విలువైన అమెరికా MQ-4C ట్రైటాన్ డ్రోన్ హోర్ముజ్ పై మాయం
  • ఎమర్జెన్సీ 7700 కోడ్ పంపిన వెంటనే 50,000 అడుగుల నుంచి క్షణాల్లో కిందికి
  • కూలిందా? కూల్చేశారా? — అసలు కారణంపై మిస్టరీ
  • అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ తర్వాతే ఘటన.. ఉద్రిక్తతలు మళ్లీ?

 

విధాత ప్రపంచం డెస్క్​ | హైదరాబాద్​:

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత కీలక సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిపై అమెరికా నేవీకి చెందిన అత్యాధునిక డ్రోన్ అకస్మాత్తుగా అదృశ్యమవడం సంచలనంగా మారింది.

అమెరికా నేవీకి చెందిన MQ-4C ట్రైటాన్ అనే ఈ డ్రోన్ విలువ దాదాపు 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,600 కోట్లకు పైగా). ప్రపంచంలో అత్యంత ఖరీదైన మానవరహిత గూఢచార విమానాల్లో ఇదొకటి.

ఇప్పటికి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ డ్రోన్ పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలసంధి ప్రాంతాల్లో సుమారు మూడు గంటలపాటు పర్యవేక్షణ నిర్వహించి, ఇటలీలోని Naval Air Station Sigonella కు తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఫ్లైట్ ట్రాకింగ్ సమాచారం ప్రకారం, డ్రోన్ ఒక్కసారిగా ఇరాన్ వైపు స్వల్పంగా మలుపు తీసుకున్నాక, ఎమర్జెన్సీ కోడ్ 7700 (సాధారణ అత్యవసర పరిస్థితి) పంపింది. కొద్ది క్షణాల్లోనే సుమారు 50,000 అడుగుల ఎత్తు నుంచి వేగంగా పడిపోతూ 10,000 అడుగుల కంటే తక్కువకు చేరి రాడార్ నుంచి మాయమైంది.

ఇది సాంకేతిక లోపమా? లేక ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేసాయా? అనేది తెలియడం లేదు. ఇప్పటివరకు అటు అమెరికా, ఇటు ఇరాన్​ అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఏంటీ ట్రైటాన్.. ఎందుకంత కీలకం?

అత్యాధునిక MQ-4C ట్రైటాన్ డ్రోన్ — గంటల తరబడి గగనతలంలో గూఢచర్యం చేసే శక్తి

ఈ MQ-4C ట్రైటాన్ డ్రోన్‌ను అమెరికాకు చెందిన  నార్త్రాప్​ గ్రుమ్మన్​(Northrop Grumman) సంస్థ అభివృద్ధి చేసింది. అమెరికా యుద్ధ విమానమైన బి2 స్పిరిట్​ లాంటి అత్యాధునిక విమానాలను ఈ కంపెనీయే తయారుచేస్తుంది. ఈ ట్రైటాన్​ డ్రోన్​ను సముద్ర ప్రాంతాల్లో దీర్ఘకాల గూఢచర్యం కోసం ప్రత్యేకంగా తయారుచేసారు.

ఇది

ఇది తరచుగా P-8A Poseidon యుద్ధ విమానాలకు “గగన నేత్రం”గా పనిచేస్తుంది. విశాలమైన సముద్ర ప్రాంతాలను ఒకేసారి పర్యవేక్షించే సామర్థ్యం దీనికి ఉంది.

ఉద్రిక్తతల మధ్యే ఘటన

అమెరికా నేవీకి చెందిన ట్రైటాన్ డ్రోన్లు — భారీ వ్యూహాత్మక గూఢచార వ్యవస్థ

అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత చోటుచేసుకోవడంతో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. హోర్ముజ్ మార్గాన్ని తిరిగి నౌకాయానానికి తెరవడానికి ఇరాన్ అంగీకరించిన కొద్దిరోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం.

హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గం. ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తతైనా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది.

అసలు ఏమైందో?

హోర్ముజ్ జలసంధి పై ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ట్రైటాన్ డ్రోన్ ప్రయాణ మార్గం ఇలా మారింది

ప్రస్తుతం రెండు ప్రధాన అనుమానాలు వినిపిస్తున్నాయి:

ఇరాన్ నిజంగా ఈ డ్రోన్‌ను కూల్చివేసి ఉంటే, అది అమెరికా అత్యాధునిక సాంకేతికతను సవాలు చేసినట్లే అవుతుంది. అదే సమయంలో, ఇది కేవలం సాంకేతిక లోపమైతే, అమెరికాకు భారీ ఆర్థిక, వ్యూహాత్మక నష్టం.

హోర్ముజ్ పై మాయమైన ట్రైటాన్ డ్రోన్ ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. సాంకేతిక కారణమైతే పరవాలేదు కానీ, ఇరాన్​ కూల్చేసిఉంటే మాత్రం, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.

Latest News