Earthquake : అమెరికాలోని పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. ‘యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS)’ వెల్లడించిన ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. న్యూయార్క్ నగరంలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు భూమి కంపించింది.
న్యూయార్క్‌కు పొరుగున ఉన్న న్యూజెర్సీలో భూకంప కేంద్రం నమోదైనట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి ప్రకంపనలు న్యూయార్క్‌కు పాకాయి. అయితే ఈ భూకంపం ఏ మేరకు ప్రభావం చూపిందనే వివరాలు తెలియాల్సి ఉంది. బ్రూక్లిన్‌లోని భవనాలు కూడా కంపించాయని ఏఎఫ్‌పీ మీడియా ప్రతినిధి తెలిపారు.
భూకంపం వచ్చిన సమయంలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో.. గాజాలో పరిస్థితిపై భద్రతా మండలి సమావేశం నిర్వహిస్తున్నది. ప్రకంపనలు చోటుచేసుకోవడంతో సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్ వరకు.. తూర్పున లాంగ్ ఐలాండ్ వరకు భూకంపం ప్రభావం చూపినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.