హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదలు వేల కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. భోటే కోషి నది ఉప్పొంగడంతో 10 జిల్లాలను, వేల ఊర్లను వరద, బురద నీరు ముంచెత్తింది. ఈ జలప్రళయానికి మంచుకొండల్లో భూకంపమే కారణమని తొలుత వార్తలు వచ్చాయి. అయితే, హిమనీ సరస్సు బద్ధలవడం వల్లే ఈ విపత్తు సంభవించినట్లు తాజాగా అమెరికా జియాలాజికల్ సర్వే తాజాగా వెల్లడించింది. పర్వత ప్రాంతాల నుంచి భారీ పరిమాణంలో ఉన్న మంచు, రాళ్ల చరియలు విరిగిపడుతున్నట్లు శాటిలైట్ దృశ్యాల ద్వారా తెలిసిందని నిపుణులు పేర్కొన్నారు. హిమనీ సరస్సు బద్ధలై భారీ మంచు చరియలు, రాళ్లు పడ్డాయి. దీంతో లిండే నది ఉప్పొంగి.. బోటే కోషి నదిలోకి వరద ఒక్కసారిగా దూసుకొచ్చింది’’ అని అమెరికా జియాలాజికల్ సర్వే స్పష్టం చేసింది. నది ప్రవాహంలో బండరాళ్లు కిందికి దూసుకొచ్చాయి.
ప్రకృతి సృష్టించిన ఆకస్మిక విపత్తులో నదులు అనూహ్యంగా ఉప్పొంగడంతో ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది గల్లంతయ్యారు. వీరిలో అత్యధికులు విదేశీయులే. భారత్ నుంచి 140 మందికి పైగా వరదల్లో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. బురదలో వందల మంది నేపాలీ ప్రజలు సజీవ సమాధి అయ్యారు. సహాయక బృందాలు బురదలో అడుగు పెడితే తెగిపోతున్న మనుషుల శరీరాలు..ఎక్కడికక్కడ వరదలో కొట్టుకొస్తున్న మృతదేహాలు కనిపిస్తూ కలవర పెడుతున్నాయి. వరద ఉదృతికి 12 జల విద్యుత్తు కేంద్రాలు ధ్వంసమవ్వడంతో ఎయిర్ పోర్టులు కొట్టుకపోయాయి. అయితే, ఈ వరదలు ఇక్కడితో ఆగకపోవచ్చని తెలుస్తోంది.
అటు టిబెట్ వైపు కూడా వరద తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆ దేశంలో ముగ్గురు మరణించగా.. 553 మందికి పైగా గల్లంతయ్యారు. .. హైడ్రలాజికల్ అబ్జర్వేషన్స్ ప్రకారం.. గల్చి ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. అదే సమయంలో మలేఖు ప్రాంతంలో ఏడు మీటర్ల మేర పొంగిపొర్లింది. వర్షాలు తీవ్రత లేకపోయినా.. ఆకస్మాత్తుగా నీరు విడుదల కావడంతో పలు గ్రామాలు, పట్టణ ప్రాంతాలను జలసమాధి చేసింది.
నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక జలప్రళయంలో గల్లంతైన వారిలో ఈశా ఫౌండేషన్ కు చెందిన 77 మంది యాత్రికులు గల్లంతయ్యారు. మానసరోవర్ యాత్రకు వెళ్లి తిరుగుపయనమై ఇమిగ్రేషన్ కార్యాలయంవద్ద ఉండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వారిలో 53 మంది భారత సంతతికి చెందినవారు ఉన్నారని ఈశా ఫౌండేషన్ ప్రతినిధి వెల్లడించారు. 37 మంది తమిళులు కూడా గల్లంతయ్యారు.
front angle of disaster 😭🙏 pic.twitter.com/HF74giJZ2N
— Soham 🔱 (@sohamjani96) August 26, 2026
